నా ఏమండీ

(అంశం. :”చాదస్తపు మొగుడు”)

నా ఏమండీ

రచయిత :: రాధ ఓడూరి

పెళ్ళి చూపుల్లో
చూడగానే అనుకున్నా ముద్దపప్పని
పెళైయ్యాక తెలిసింది
ఛాదస్తపు మెుగడని

ఏమండీ అని పిలిస్తే
తప్పు తప్పు అలా పిలవకూడదు
శ్రీవారూ అని పిలువన్నాడు

ఇంకా నయ్యం…!
మెుగుడా అని పిలవమనలేదు

ఒకరింటికి…!
వ్రతానకంటూ వెళ్ళాము
అక్కడ అన్నారు
దీవించండీ మీ భార్యా భర్తలని

అప్పుడు చిందులేసాడు
నా భర్త…!

భర్త లేంటి మీ దినం పెట్టా
నా భార్యేమన్నా ద్రౌపతా…!
భర్తలుండటానికి
నేను మాత్రమే భర్త…!

అన్నాడు గట్టిగా…!
కళ్ళెర్రజేస్తూ
నా చేయి పట్టుకొని
బయటకొచ్చేస్తూ…

అవును మరి…!
నా ఏమండీ అంది కరెక్టేగా
అమ్మో…!
ఇదేంటి నా మెుగుడి ఛాదస్తపు మాటలు నాకొచ్చాయి…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!