(అంశం. :”చాదస్తపు మొగుడు”)
ఎడ్డెమంటె తెడ్డెమంటడు
రచయిత :: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి
చాదస్తపు మొగుడు
చెబితే వినడు
కొడితే ఏడుస్తాడు అన్నట్టు
చెప్పిందే చెబుతాడు
చెప్పి బుర్ర తింటాడు
బయటోళ్లకు మంచోడు
ఇంట రచ్చ చేస్తాడు
మంచి చెబితె వినడు
మంకుపట్టు వదలడు
తనకన్నీ తెలుసంటడు
తెలియనిదే లేదంటడు
నా నోట మాట రానీయడు
తన నోట మాటలాపడు
తిండి కాడ బెట్టు చేస్తడు
నా వంటకు వంకలెతడు
పనులేమీ రాని వాడు
ప్రతి పనికి పేరులెడతడు
సాయమైనా చెయ్యబోడు
సాకు లెన్నొ చెబుతాడు
కూర్చుంటే తప్పంటడు
నిలుచుంటె వద్దంటడు
పడుకుంటే తిడతాడు
పనిచేస్తే గొణుకుతాడు
నవ్వితేను వలదంటడు
ఏడిస్తేను అలుగుతాడు
ఖర్మకాలి దొరికాడు
కట్టుకొన్న మొండి మొగుడు
ఎడ్డెమంటె తెడ్డెమంటడు
తెడ్డెమంటె ఎడ్డేమంటాడు
Nice