ఎత్తుకు పై ఎత్తు

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

ఎత్తుకు పై ఎత్తు

రచయిత :: కమల’శ్రీ’

పొద్దు పొవడవక ముందే నిద్రలేచి
తలారా చన్నీళ్ల స్నానం చేయమంటాడు

రోజూ తలస్నానం చేస్తే
జలుబు చేస్తది రా మగడా అంటే
ఒంటితో పాటూ తలనీ శుభ్రం చేసుకోవాలంటాడు

పోనీ రోజుకి ఒకసారైతే బాగానే ఉన్ను
రోజుకి రెండుసార్లు అదీ ఇంట్లో ఉంటే
బయటకు వెళ్తే సరాసరి పెరట్లో దూరి
తలారా స్నానం చేయందే ఇంట్లోకే వెళ్లనీయడు

ఇంట్లో ఉన్నప్పుడేమన్నా అత్యవసరమై
బాత్రూంలో దూరితే మళ్లీ స్నానం

ఇలా రోజూ చేసీ చేసీ
నా నడుం దాటి ఉన్న జడ కాస్తా
మెడకి చేరింది
నల్లగా నిగనిగలాడుతూ ఉండే
నా జుట్టు చీకేసిన తాటి టెంక లా
మారింది

తెల్లగా మెత్తగా ఉన్న నా శరీరం
సబ్బు రాసీ రాసీ పొలుసులు పట్టింది

మాటిమాటికీ తలస్నానం చేసీ చేసీ
జలుబు చేసి ముక్కు కారడం మొదలైంది

నీళ్లలో నానీ నానీ నా పాదాలు వేళ్లూ
వంకర్లు పోతున్నాయి

ఇట్టాగే ఇంకొన్ని రోజులుంటే
హాస్పిటల్ లో బెడ్ నాకోసం
మాట్లాడుకోవల్సి వస్తుందేమోనని
రాత్రి కి రాత్రి పెట్టే బేడా సర్దేసీ
మా కన్నవారింటికి వెళ్లిపోయా

ముందు నా వాలకం చూసి
పోల్చుకోని మా అమ్మ
నా పెళ్లి ఫోటోలు చూసి
నేనే వాళ్ల కూతుర్నని
పోల్చుకుంది ఆఖరికి

ఏమైందే అమ్మా ఇలాగైపోయావేంటే
అంటూ కంగారు పడితే
ఇదంతా నా చాదస్తపు మొగుడి నిర్వాకం
అంటూ వివరించా మొత్తం
విన్న వాళ్లేమో ముక్కున వేళ్లేసుకున్నారు

మరునాడు పొద్దున్నే దిగబడ్డాడు
నా మొగుడు నన్ను వెతుక్కుంటూ
నేను రానంటే రానంటూ
తెగేసి చెప్పేసా

నువ్వు లేకపోతే నేను బతకలేను
అంటూ బ్రతిమలాడితే
రోజులో పదిమార్లు తలస్నానం
చేయమంటే ఈ జన్మలో మీ ఇంటికి రానన్నా

సరే నీ ఇష్టమే రోజులో ఓ రెండు సార్లు చాలు
అంటూ నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లాడు

హమ్మయ్యా అంటూ ఇంటిబాటపట్టాను
మరునాటి నుంచి తలస్నానం అయితే వద్దన్నాడు

కానీ….
బయటకు వెళ్లి వచ్చిన ప్రతీసారీ
తలకి సానిటైజర్ రాసుకోమంటున్నాడు
వీడెక్కడి చాదస్తం మొగుడు రా నాయనో
సానిటైజర్ కంటే తలస్నానమే నయమంటూ
తలస్నానానికే ఓటేసా

నేను ఓ ఎత్తేస్తే
ఎత్తుకు పై ఎత్తు వేస్తాడు నా మొగడను కోలేదు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!