ప్రియసఖి

ప్రియసఖి

రచన: సావిత్రి కోవూరు 

కలత నిద్రలో నేను కన్న కలలన్నీ
నీ మది చేర వేద్దామని ఉద్యుక్తమవ్వగ,

చిలిపిగా తాకు ఈ పవర్ వీచికలు ప్రియమార పలకరిస్తూ,

నను నిలువనీక తమ గంధమును విసురుగా విసరగా,

తట్టుకునే శక్తి సన్నగిల్లి ఆ అల్లరిని నీకే వివరించాలని,

అంతరాయం ఉండని ఏకాంతముగా ఏటిగట్టున

యేటి గలగలలలో కూడా నీ పిలుపే వినిపించగా

నా కాలి మువ్వల సవ్వడి నీ రాకేమోనని భ్రమ కలిగించగా,

నెమలి పించం వర్ణములన్ని నా నిర్మలమైన మదిని వర్ణ భరితం చేయగా,

నా మదిలో ఉన్న నీకు లేఖ రాసి నీ మదికి తెలపాలని తలవగా,

తడవ తడవకు తమ ఉనికిని తెలుపుతు,

నీ తలపులు జలపాతాలై తుషార బిందువుల పన్నీరు చిలకరించగా,

తెరిచిన నా మది పుస్తకము పై నీ తలపుల సిరా చుక్కలు చల్లి ఊరడించగా,

నీ పదముల రాక కని నా హృదయం మయూరమై
నృత్యం చేసెను,

నీ రాకకై వేయి కళ్ళతో తనువంత పులకరింతలతో

చకోరంలా వేచి చూస్తున్న నీ ప్రియ సఖినై.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!