(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)
నువ్వేటో.. సిత్రం! భలే భలే భళారే విసిత్రం!
రచన:: బి హెచ్. వి.రమాదేవి
నల్లకలవ పువ్వులా ,
నాగమల్లి నవ్వులా,
పాలకంకి పళ్ళతో,
పాల ముంజ కళ్ళతో,
నువ్వు చూస్తేనే సిత్రం!
బొప్పాయి ల గుండెలు,
కొప్పున పూదండలు,
తలమీద కుండలు!
తడిపొడి కైదండలు
భామా ! ఓయ్!భళారే !
సింత పూల రైక దానా!
సిగురాకు సొగసు దానా,
సిత్రాల తోటలో న,
విసి త్రాల సిలక నీవు,
ఎన్నెల పూమొలక వీవు.
నీవు తోడు, జోడునాకు,
కష్టం ,కన్నీరు తుడుచు,
నష్టం వచ్చిన నీ పడుచు,
ధైర్యం నింపును చూడు!
జగతికే ప్రగతి గీతి పాడు!
అందుకే బ్రతికి చూడు!
అన్నదాతను! గుండె చూడు!
ఆకలి డొక్కలు పంపును! అమృత మనపెరిమను
కూసింత ధైర్య సుధను.
***