పూలు

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

పూలు

రచన:: చెరుకు శైలజ

దేవుడికి పూజ కోసం పూలు
వెతుకుతున్నయి కండ్లు
ఆలోచిస్తూ నడుస్తుండగా ఆకస్మాత్తుగా
ఆగిపోయాయి కాళ్ళు
ఒక దగ్గర రెండు మొక్కలు గులాబి రంగు పూవులతో నన్ను పిలుస్తు ఆకర్షించాయి.
ఆనందంతో పూసిన పూలను చూస్తున్న
పూల కింద అనుకొని ఉన్న గింజలు కనబడ్డాయి.
పూలు తీసుకోని వెళ్లితే ఇప్పటి పూజకే ఉంటాయి.
గింజలు తీసుకొని కుండిలో చల్లితే
ఎప్పటికి పూలు ఉంటాయి కదా! అనే ఆలోచనతో
గింజలు తీసుకొని వచ్చి
ఒక కుండిలో వేశాను
రోజు నీళ్ళు పోశాను.
ఒకరోజు చిన్న మొలక కనిపించింది.
ఆశ్చర్యం , ఆనందం
ఆ మొక్క పెరిగి పెద్దది అయింది .
ఒకరోజు అందాలోలికే గులాబి పూలతో
మొక్క నన్ను పలకరించింది.
ఎంత ఆనందం మదిలో
ఏమిచ్చి తీర్చుకొను వీటి ఋణం
ప్రకృతి ఎంత చిత్రం కదా!
ఏమి ఆశించకుండా మనకు అందమైన పూలు ఇవ్వడం భళారే విచిత్రం
ప్రకృతి లో చిత్రం భళారే విచిత్రాలు ఎన్నో ఉన్నాయి
ప్రకృతిని ప్రేమించి,పూజించి కాపాడుకోవాలి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!