లోకం తీరు!?

లోకం తీరు!?

రచయిత :: ఎన్.ధన లక్ష్మి

అదో  మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు …ఏంటి వదిన ఇంకా ఎప్పుడు మాకు మనవుడి గురించి శుభవార్త చెప్పుతారు అని అందరూ అడుగుతారు కామాక్షిని ఆవిడా నవ్వుతూ మా వాడికి పెళ్లి అయి ఏడాది కదా అయింది ఇంకా చాలా టైం ఉంది .అరేయ్ వదిన మీ వాడికి పెళ్లి అయినా నెలకు మా వాడికి అయింది వాడికి కూడా కూడా బాబు పుట్టాడు అని చెపింది అక్కడే ఉన్న సీతారత్నం …
అత్తయ్య మిమ్మలని మావయ్య పిలుస్తున్నారు అని అక్కడికి వచ్చింది అభినయ. కరెక్ట్ టైం కి వచ్చావు అన్నారు అక్కడే  ఉన్న మిగతా ఆడవాళ్లు చెప్పండి పిన్ని గారు అని వినయంగా అడుగుతుంది అభినయ ..
పెళ్లి అయి ఏడాది అయింది ఇంకా ఎప్పుడు మాకు శుభవార్త చెప్పుతావు..అభినయ బాధగా
తలదించుకుంటుంది . సీతారత్నం కామాక్షి తో ఏదైనా లోపం ఉందొ ఏమో ఒకసారి డాక్టర్ కి చూపించవచ్చు కదా అంటుంది .
ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటారు అక్కడ నాన్న పిలుస్తున్నారు అంటూ అక్కడికి వచ్చాడు     సంజయ్. అభినయ కంట్లో నీళ్లు చూసి ఏమి అయింది అని కళ్ళతోనే అడుగుతాడు తాను ఏమి చెప్పదు ..
ఏంటి సంజు మాకు ఎప్పుడు  శుభవార్త చెప్పుతావు అని సీతారత్నం అంటే ఏమి శుభవార్త చెప్పాలి .మేము కొత్తగా ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము . నేను అయితే కొత్త మోడల్ బైక్ కొన్న అని అని చెపుతుంటే సీతారత్నం సంజు మేము అడిగింది పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెప్పుతావు అని నవ్వుతారు.సంజుకు  అర్థము అవుతుంది ఎందుకు అభి కంట్లో నీళ్లు ఉన్నాయో .అరే ఆంటీ మొన్నటివరకు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు రా అన్నావు .ఇపుడు ఏమో ఇంకా ఎప్పుడు పిల్లలు అంటావు .ఏంటో మీరు అనుకుంటూ వాళ్ళ అమ్మను ,అభిని తీసుకొని వెళ్ళిపోతాడు.
మ్యారేజ్ అంత చూసుకొని ఇంటికి వెళ్ళారు..
సీతరత్నం అన్న మాటలు తలుచుకొని అభి ఏడుస్తూ ఉంటె సంజు తనని ఓదారుస్తాడు . ఇలా ఏడుస్తూ ఉంటె మనకు పిల్లలు ఎలా పుడతారు మన వంతు కొంచం కస్టపడాలి తనని దగ్గరికి  తీసుకుంటాడు.
ఒక రోజు అభికి డౌట్ వచ్చి సంజు ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళుతుంది .అభి అనుమానం నిజం అయి తాను ప్రెగ్నెంట్ అని డాక్టర్ కంఫర్మ్ చేసింది అభి ఎక్కడ ఉన్నాడో మర్చి పోయి మరి అభి పట్టుకొని గట్టిగ హాగ్ చేసుకొని కిస్ చేస్తాడు. డాక్టర్ గారు బాబు సంజు నేను ఇక్కడే ఉన్న అని నవ్వుతాడు ..వాళ్ళు ఇద్దరు దూరం జరగుతారు ,,
వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పుతారు ..వాళ్ళు హ్యాపీ గ ఫీల్ అవుతారు
“అమ్మ అభి నా మనవడు నీ కడుపులో ఉన్నాడు ఇంకా నుంచి నువ్వు ఏమి పని చేయకూడదు అని కామాక్షి ,రేయ్ సంజు మన వారసుడు తన కడుపులో ఉన్నాడు ..అభికి ఏమి కావాలన్నా క్షణంలో తెచ్చిపెట్టు అని సూర్యం గారు వాళ్ళ ఆనందాన్ని తెలుపుతారు “..
అభి వాళ్ళమ్మకు కాల్ చేసి చెపితే వాళ్ళ అమ్మ కూడా రోజు కుంకుమ పువ్వు పాలలో వేసుకొని తాగు నా మనవడు అందంగా పుడతాడు అని చెపుతుంది
అభి కి ఇష్టమైన స్వీట్స్ తీస్కొని వచ్చాడు సంజు అభి బంగారం చూడు నీకు ఇష్టమైన స్వీట్స్ కోవా జిలిబి తీసుకొని వచ్చా కొంచం తిను  అని నోటికి అందిస్తాడు ..అపుడు గమనిస్తాడు అభి డల్ గా ఉండడం చూస్తాడు ..
ఏమైంది రా అని లాలన గ అడుగుతాడు .అభి ఏమి లేదు నాకు నిద్ర వస్తుంది అని నిద్ర పోతుంది ..ఇది ఏదో మనసులో పెట్టుకొని బాధ పడుతుంది …
ఏమిటో నిదానంగా తెలుసుకోవాలి అని సంజయ్ అనుకుంటాడు.
తరవాత రోజు అందరూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటె ఏదో న్యూస్ ఛానల్ లో అమ్మాయీ పుట్టింది అని వాళ్ళ హస్బెండ్ తనను వదిలివేశారు అని టెలికాస్ట్ చేస్తున్నారు ..అది చూసి అభి ఏడవడం స్టార్ట్ చేస్తుంది ..
అందరూ కంగారు పడి ఏమైంది రా ఎందుకు ఏడుస్తున్నావు అని లాలన గ అడుగుతారు అందరూ …
అభి సంజయ్ ని గట్టిగ పట్టుకొని నువ్వు కూడా నన్ను వదిలివేస్తావా పాపా పుడితే …
ప్లీజ్ సంజు అల చేయకు నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఏడుస్తుంది ..సంజు తనని పట్టుకొని నీకు ఎవరు చెప్పారు నేను అల చేస్తాను అని ..
మరి అందరూ నేను కడుపుతో ఉన్న  అని తెలిసినప్పటి నుంచి బాబు జాగ్రత్త అని అత్తయ్య ,మామయ్య ,మా అమ్మ నాన్న ,ఆఖరికి ఇరుగుపొరుగు వారు కూడా అలాగే అంటున్నారు ..ఇపుడు న్యూస్ ఛానల్ లో కూడా ఎవరో అతను వాళ్ల భార్యను వదిలివేశారు పాప పుట్టిందని అంటూ గట్టిగ ఏడుస్తుంది ..
చూడు అభి మన ప్రేమకు ప్రతిరూపం మన బిడ్డ అది పాపా అయితే ఏంటి? బాబు అయితే ఏంటి ? ఇంకా నిజం చెప్పాలి అంటే పాపా అంటేనే నాకు చాలా ఇష్టం ఎందుకో తెలుసా మనం సరిగా పెంచితే  మనలన్నీ కంటికి రెప్పలా చూసుకుంటారు. నాకు అయితే మరో అమ్మ అవుతుంది మన పాపా అని ప్రేమగ చెపుతాడు సంజు ..
ఇదంతా విన్న కామాక్షి ,సూర్యం గారు కూడా మాకు కూడా పాపా అయినా ,బాబు అయినా ఎవరైనా మా వారసులై కదా ! నువ్వు ఎలాంటివి మనసులో పెట్టుకోకు తల్లి అంటారు ..
అపుడు అభి  మనసు కుదుట పడుతుంది ..కొన్ని నెలలకు అభి ,సంజు ల ప్రేమ గుర్తుగ  పాపా ,బాబు ఇద్దరు పుడతారు ..
వాళ్ళ నామకరణం చాలా అంగ రంగ వైభవంగా జరుపుతారు . అభిసారిక ,అభినవ్ అని పేరు పెడతారు.ఆ ఫంక్షన్ కి వచ్చిన సీతారత్నం ..అవును సంజు ఇంతకీ పిల్లలను ఏ స్కూల్ లో జాయిన్ చేయాలి అనుకుంటున్నారు ,ఇంతకీ ఏమి చదివించాలి అనుకుంటున్నారు ఇలా అడుగుతుంటే అభి ,సంజు గట్టిగా నవ్వుతారు ..
ఎదుటివారికి ఏదో ఒక టాపిక్ కావాలి ..మనం ఎలా ఉన్న వాళ్ళు ఏదో ఒకటే అంటూ ఉంటారు అవన్నీ మనం కేర్ చేయకూడదు ..
తెల్లగా ఉన్న ,నల్లగాఉన్న ,సన్నగా ఉన్న ,లావుగా ఉన్న ఏదో ఒకటే అంటూ ఉంటారు వాళ్ళను  పట్టించుకోకుండా మన పని మనం చేయాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!