పెంకి పెళ్ళాం

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

పెంకి పెళ్ళాం

రచన :: ఆర్కా

దూరంగా ఉంటే కవ్విస్తుంది…
దగ్గరకొస్తే పొమ్మంటుంది…
చూపులతోనే వలపు బాణాలు వేస్తూ…
మనసునే లాగేస్తుంది…
కౌగిలిమ్మన్నా కోప్పడుతుంది…
ముద్దిమ్మన్నా ముడుచుకుంటుంది…
ఏమీ చెయ్యరని చురకేస్తుంది…
అవకాశమిమ్మంటే చొరవ చేయమంటుంది…
చొరవ చేసినచో బలవంతమంటుంది…
కాళ్ళు పట్టుకుంటే పతిదేవుడంటుంది…
నడుము పట్టుకున్న…
కంటి చూపు చివర నుంచి
పెదవంచు నవ్వుతో
నా మగతనాన్నే ప్రశ్నిస్తుంది…
బతిమాలనా…
బామాలనా…
నిలదీయన…
బలాత్కరించనా…
ఏమి చేయాలి??? అనే సందేహమునున్న
నన్ను చేరి….
వలపుల వాన కురిపిస్తుంది…
తీయని మధువులలో కరిగిస్తుంది…
పైయద బిగువులలో నలిపేస్తుంది…
చెలి తనూవే స్వర్గమని…
సుఖమయ తన్మయత్వంలో ఓలలాడిస్తుంది…
నా చెలి… నా చిలిపి పెళ్ళాం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!