నాకు నేనే గొప్పోడిని

నాకు నేనే గొప్పోడిని

రచన :: VT రాజగోపాలన్

ప్రశంసా పత్రాలంటే
పరుగెడతా నేను
పట్టుమని పది నిమిషాలు
ప్రతి రోజూ కూర్చోను

వికీపీడియా నా ముందు
విశ్వాసంగానే ఉంది
ఏ ప్రశ్నలిచ్చినా
నాకు మాత్రం సులభమే

సమాజానికుపయోగం
నా కవితలకుండదు
ప్రశంసా పత్రాలు
నా ఇంటిలో మెండుగా

రెండు రోజుల సమయంలో
నూటికి తొంభై తెచ్చా
నాలుగు గోడల మధ్య
నాకు నేనే గొప్పోడిని..

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!