చెట్టు
రచయిత :: డా. అడిగొప్పుల సదయ్య
సీ.ప.
అతినీల కిరణాల నాపి యిద్ధర కాచి
గొడుగు పట్టెడి జాలి గుండె యెవరు?
గాలినే గాలించి కసటునే తొలగించి
దిటవిచ్చు భువి గాలి తిత్తి యెవరు?
పంచభూతములను వండి,యిద్ధరణికి
తిండి బెట్టెడి పెద్ద దిక్కు నెవరు?
భువిలోని జలమును దివిపైకి నెక్కించి
నీరదంబై వాన నిచ్చు నెవరు?
ఆ.వె.
పుట్టినపుడు నీకు తొట్టియైన దెవరు?
ఎండలందు నీకు నిగము నెవరు?
అంత్యకాలమందు నాదరించునెవరు?
చెట్టు గాద నరుడ? కట్టె కాద?
తరువు ప్రాశస్త్యమును చక్కగా తెలిపితిరి👌👌💐💐💐