“నా ఆత్మ”
శరీరపు పంజరం లో ఊపిరి ఆడని ఈ ఆత్మ ని…
మనసు ప్రేమ అనే కొరడాలతో పదే పదే పడే ఈ దెబ్బలని
బరించే ఈ ఆత్మని….
బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అంటూ
ప్రతి క్షణం మోక్షానికి దూరం చేస్తున్న ఈ మాయ
నుండి ఈ ఆత్మ ని…
డబ్బు కోరిక మొహం అంటూ వికృతంగా ఉండే ఆలోచనల
నుంచి ఈ ఆత్మ ని …
అన్నీ తెలిసి తెలిసీ మళ్ళీ అదే బురదలో కూరుకు పోకుండా
ఈ శరీరం నుండి కాపాడు తండ్రి ఈ ఆత్మ ని …… శివప్పా
రచన: లక్ష్మి జగర్లపుడి