మంచు పువ్వులు…
కొమ్మ కొమ్మను తొడిగిన పువ్వులు మంచు పువ్వులు….
ఉషోదయ కిరణాలతో మిణుకు మిణుకున మెరిసే పువ్వులు మంచు పువ్వులు…
కొత్తగా పూసిన పువ్వుల అందం మరింత పెంచే మంచు పువ్వులు…
పువ్వులు తొడగని కొమ్మల వ్యధను దూరం చేసే మంచు పువ్వులు…
ప్రతి మొక్క వృక్షం అందం పెంచే మంచు పువ్వులు….
నీటి బిందువుల మరి భూమికి చెట్టుకి వంతెన గా మారే మంచు పువ్వులు..
తెలవరే వెలుగులో దుప్పటి లా మరి మొత్తం ప్రపంచాన్నీ తనలో దాచుకున్న మంచు చిరురెమ్మ కి మరే పువ్వుల కుసుమంలా…
చంద్రుడి కిరణాలతో తమ చల్లదనాన్ని గాలిలో సమ్మిళితం చేసి నింగినుంచి కురిసే మంచు మరే పువ్వుల వర్షంలా…
రచన: కొఠారు నాగ సాయి అనూష..