తీరం చేరని కెరటాలు

 తీరం చేరని కెరటాలు

 నా కళ్ళలో పొంగుతున్న సంద్రానికి తెలియదు తనది తీరం చేరని ప్రయాణం అని…
కాలానికి  తెలియదు , కాలాలు మారిన నీ ధ్యాస మారదు అని..

లోకానికి తెలియదు,  పంటి బిగువున నా బాధ దాచేసి
నవ్వుల జల్లులు కురిపిస్తునాను అని….

నీకు తెలియదు, నా గుండె లోతుల్లో గాయం నీవు తాకితే మాయం అవుతుంది అని…

కానీ నాకు మాత్రమే తెలుసు నీవు ఎప్పటికీ నా దరి
చేరవు అని…

ఒక్క క్షణం కూడా నీ తలపు లేని నా మది నిలువ జాలదు అని…

ఇది ఎప్పటి వరకు అంటే నా తుది శ్వాస విడిచే వరకు అని …

ఈ ముగింపు లేని ఆలోచనలు ఎప్పటి వరకు అంటే ఏమి చెప్పగలం…

రెండు గుండెల చప్పుడు ఆగేవరకు అని…

  ఈ లోకంలో “ప్రేమ”  ఉన్నంత కాలం ,మనం ఈ అంతులేని ఆలోచనల ప్రవాహంలో ఉప్పెనలా మునిగి తేలుతూ ఉంటాము అని….

రచన: లంకా జయకుమారి

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!