విధి చిత్రం

విధి చిత్రం

రచన: పద్మజ రామకృష్ణ.పి

కాగితపు పువ్వులు సువాసనలు వెదచల్లేన.?

కుళ్ళు కుతంత్రాల మనుషుల నుండి
మానవత్వం పరిమళించేనా.?

దేహ సౌదర్యాన్ని మెచ్చడం తప్ప..
అంతరంగిక సౌదర్యం చూడలేరు అందరూ..

వికృతమైన చేష్టలకు ముసుగు వేసే
అతి వినయపు బుద్ధులు..

వెళ్లిపోయే కాలానికి చెల్లిపోయే పాపాలు చేసినా
మరల పాపలుగా పునర్జన్మ తప్పదు కర్మ సిద్ధాంతం.

మంచికి చెక్కబడిన మనుషుల్లో మంచిని
చూడలేక విషం చిమ్మే కొందరు..

అమృతంతో నిండిన మనసుల
హృదయాలకు అవగతమే అన్ని..

అడుగడుగునా అవమానాలు.. అందలాల అంబరాల సంబరాలు..! విధి చిత్రం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!