నేనో…ఆడపిల్లను

నేనో…ఆడపిల్లను

 

అందాల రూపంతో

అమ్మ గర్భం నుంచి ఆవిర్భవించాను 

నేనో ఆడపిల్లనై

 

తడి ఆరని నా దేహాన్ని 

గుండెలకు హత్తుకున్న నాన్నకు

అమ్మ యిచ్చిన

అపురూప కానుకను నేను

 

నాకన్న ముందే పుట్టి

నా తొలి నేస్తమైన అన్నయ్యకు

నేనో గారాల పట్టిని

చిట్టి చెల్లెమ్మను

 

నా అల్లరికి చెక్ పెట్టేందుకు

నాతో పోట్లాడేటందుకు

నాక్కూడా పెద్దరికాన్ని తెచ్చిపెట్టిన 

నా చిన్ని తమ్ముడికి

నేనో అక్కను

 

పదహారణాల పడుచులా 

పరవశించిపోతున్న నన్ను 

మనువాడిన నా బావకు

నేనో బాధ్యత గల భార్యను

 

సృష్టిలో అన్నింటిని మించిన ఆనందం

నేనో పరిపూర్ణ మహిళగా మారిన క్షణం

పొత్తిలలో బోసి నవ్వుల నా పసిపాపను

అమ్మగా లాలించిన వేళ

నా జీవితాన్ని నేనెంతో ప్రేమిస్తున్న

                                           రచన:తాళ్ళ శ్రీకాంత్..

You May Also Like

2 thoughts on “నేనో…ఆడపిల్లను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!