పో..పోవే

పో..పోవే

 

విరిగిన మనసా వదిలిపోవే

వదిలిన తలపా రాలిపోవే

అలసిన ఆవేదన ఇక ఆగిపోవే

 

విసిగిన ఆలోచనా వేదించక పోవే

వేగిన విరహమా వయసుతో పోవే

ఆశల సౌధమా కలలోనే కరిగిపోవే

 

జ్వలించే గాయమా ఇక మానిపోవే

కరిగిన గతమా కాలంలో కలసి పోవే

నలిగిన హృదయమా రోదించక పోవే

 

బాధించే వలపు వలయమా నువు వెళ్లిపోవే

వర్షించే కన్నీటి మేఘమా కురవక నువు పోవే

మోడైనా సమయమా చిగురించి నువు పోవే

 

పలుకుల ఓ కులుకా మౌనంగా మిగిలిపోవే

విలువ లేని మనిషికై వ్యథమాని సాగిపోవే

వంచించిన ఓ.. విధీ నా గెలుపు చూసిపోవే

                                                 రచన:బుజ్జమ్మ

You May Also Like

5 thoughts on “పో..పోవే

  1. పోవే..వెళ్లిపోవే అంటే పోయేవి కాదుగా మనమే వదిలించుకొని వెళ్లిపోవాలి 👌🏻👌🏻👌🏻👏👏👏👏👏❤️అమేజింగ్ లైన్స్ బుజ్జమ్మ

  2. జ్ఞాపకాలు పోవే అన్నంత మాత్రాన పోయేలా అయితే గతాన్ని తలుచుకుని బాధ పడే వాళ్లే ఉండరుగా..చాలా బాగుంది …👌

  3. జాలి లేని కాలమా ఆగిపోవే
    వేధించే గతమా తిరిగి రాకే
    వసంతాల భవితను చూసి కుళ్లుకొకే
    👏👏👏👏👏సుపెర్బ్ బుజ్జమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!