చెట్టు చెప్పిన జీవితం
రచయిత :: అనిల్
విసిగిపోయిన మనసంతా
పండిపోయిన ఆకుల్లా రాలిపోతుంది..
ఎంత గమనమో ముందే తెలిస్తే చెట్టుతో పాటు అంత ఎత్తు ఎదిగుండవు కదా..
రాలిపోతాయని తెలిసుంటే అంత గట్టిగా పెనవేసుకోవు..
అయినా ఎండిపోతే ఎగిరిపోవటమేంటీ…
అప్పటివరకూ గాలిచ్చిన ఆకులే
రాలేటప్పటికి ఆ గాలితోనే సాగనంపబడుతున్నాయి..
సరిగ్గా జీవితం కూడా ఇలానే అనిపిస్తుంది.
అన్ని బంధాలలో ముడిపడి ఉన్నా..
కొత్త మనసులతో తబ్బిబ్బవుతున్నా..
హుషారంతే ..👍
చాలా కొద్దిపాటే..
అది పాతైపోతుంది కాసేపటికే…
ముసుగేస్కుని ఎవరైనా ఎంతసేపుంటారూ..
అందరూ కలిసున్నట్టే ఉంటారు.
కానీ మన మనుషుల్ని మనం గుర్తుపెట్టుకోవటంలోనో,
వారికి గుర్తింపు ఇవ్వటంలోనో విఫలమవుతుంటాం..
చాలాసార్లింతే..!
ప్రశ్నల సమాధానాలు బదులడిగితే ఒక తప్పు.
జవాబుల ప్రశ్నలు జతకాకపోతే ఇంకో తప్పు.
కాకపోతే నిజం ,
నీలా నిన్ను చూసే నీ జంటలో జత కళ్ళే..
నీ కలవరింతలో ఉన్నంత స్వచ్చమైన అవతలి మనసే కదా..!