సిగిరెట్..
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: మాధవి కాళ్ల
పొగను పీల్చడం వల్ల నీ ఆరోగ్యమే కాకుండా
పక్క వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది
వినోదం కోసం తాగుతూ నీ కట్టె నువ్వే కాల్చుకుంటున్నావు
పొగగా మారి ఊపిరి తీసుకుంటున్నావు
ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయి
పొగను వ్యసనంగా మార్చుకొని,
నీతో సహవాసం చేస్తుంది
మీరు కాల్చుతుంది సిగిరెట్ కాదు
మీ జీవితాన్ని అని మర్చిపోవద్దు…
నీ ఒకడి గురించే కాదు నీ కుటుంబం గురించి ఆలోచిస్తూ
ఇప్పుడైనా నువ్వు ఈ పొగ త్రాగడం మానుకో
లేదంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది..
నువ్వు తాగే సిగిరెట్ ఖర్చుతో కుటుంబాన్ని పోషించవచ్చు..
నువ్వు సిగిరెట్ తాగడం వల్ల నీ ఆస్తులను కరిగిస్తుంది…
సమాధానం లేని ప్రశ్నలా నీ జీవితం మిగిలిపోతుంది…
మానుకో మానుకో నీ సిగిరెట్ అలవాటు
నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకో