ఓ తల్లి ఆవేదన…

ఓ తల్లి ఆవేదన…

(తపస్వి  మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : సుజాత కోకిల

మంచితనానికి మానవత్వానికి కవిత్వం అద్దం లాంటిది. అద్దంలో మన ప్రతిబింబాన్ని రోజూ చూసుకుంటూ మురిసిపోతుంటాం. సాహిత్యం కూడా అమ్మ పాడే జోలపాట లాంటిదే ప్రతి హృదయాలను కదిలిస్తుంది సాహిత్యం. కవిత్వం మన కలం నుండి రాసే అక్షరాలు తీగలా అల్లుకుపోతు భావోద్వేగాలను పటిష్టం చేస్తూ మంచి మార్పులను తీసుకొస్తుంది. కవిత్వం మనిషి హృదయాలను రంజింప చేస్తుంది. అదే సాహితీవేత్తల గొప్పతనం. కవిత్వం మనసును కదిలించి మంచిని పెంచేలా చేస్తున్నాయి. వాటిని చదువుతూ ఉంటే మంచి ఆలోచన వచ్చేలా చేస్తాయి. కాని ఇప్పుడు ఎందుకో పిల్లల్లో అర్థం లేని ఆవేశాలు, ఎందుకో తెలియని కోపాలు పిల్లల్లో మార్పులు కనిపిస్తున్నాయి. కాలక్రమేనా అవి పెరుగుతూనే ఉన్నాయి. సమాజంలో మార్పు రావాలంటే సాహిత్యం, కవిత్వం అంటే తెలుసుకునేలా ప్రతి మనిషి పుస్తకం చదివేల చేయాలి. స్కూల్ నుండి మొదలవ్వాలి. అప్పుడు మనం చదువుకునే రోజులలో మనకు పద్య, గేయాలు ఎంతోమంది సాహితీవేత్తల రచనలు మనం చదివేలా చేశారు. మంచి ఆలోచనలు పరిజ్ఞానం పెరిగేలా చేశారు. ఇప్పటి సమాజం గురించి, ఇప్పటి పరిస్థితుల గురించి పిల్లల్లో మంచి అవగాహన కలగడం లేదు. ఎప్పుడు ఎలా మారుతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందనేది సమస్యగా మారింది. ఇప్పటి సమాజంలో టెక్నాలజీ పెరిగింది. మంచి మార్పులు వచ్చాయి.
అయినా వారిలో ఆలోచన విధానం, ఆవేశాలు వేరేలా ఉంటున్నాయి. రిలేషన్స్ తగ్గాయి ఇంట్లో ఎంత మంది ఉన్నా ఎవరికి వారే ఏకాకిగా  మిగులుతున్నారు. వాళ్ళ ఆలోచనలకి వాళ్ల మార్పులకి దేనికి పొంతన కుదరడం లేదు. తల్లిదండ్రులకి పిల్లలకి మంచి అవగాహన కుదరడం లేదు పిల్లల తప్పంటే పెద్దవాళ్లది తప్పనే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. చివరికి ఎవరిది తప్పని అర్థం కావడం లేదు. ఇప్పుడున్న పిల్లలు సరిగా అవగాహన చేసుకోకపోవడం వలన లేక పరిణితి తెలియడం లేదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఏంటో తెలియదు కానీ కన్న ప్రేమను మించినది ఏదీ లేదు కన్న ప్రేమను, పెంచిన ప్రేమను తృణప్రాయంగా తుంచి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ తల్లికి జీవితాంతం పుత్రశోకాన్ని మిగిల్చి పోతున్నారు. పెద్దవాళ్లల్లో అవగాహన లేకపోవడం సమిష్టి కుటుంబాల నుండి స్వేచ్ఛ కోసం చిన్న కుటుంబాలుగా మలుచుకోవడం రిలేషన్ ని తగ్గించుకోవడం ఇలాంటి కారణాలేనని నేను చెప్తాను. రిలేషన్ షిప్ చాలా అవసరం. మనవాళ్లు ఉన్నారనే భద్రత కలిగించాలి. మన తల్లిదండ్రులతో పంచుకోలేనివి మన రిలేషన్ షిప్ తో మంచి చెడ్డలు చెప్పుకుంటారు. అలా ధైర్యం ఉండేలా కలిగించాలి. ఇదే ప్రతి ఒక్కరికి తెలిసేలా మన కలం ద్వారా తెలియజేయాలి సాహిత్యం ప్రతి మనిషికి అవసరం మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఉత్తేజ పరుస్తుంది సాహిత్యం.
తల్లి నవమాసాలు మోసి కంటుంది. పురిటి నొప్పులను భరిస్తూ తన బిడ్డ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పునర్జన్మనిస్తుంతుంది ఆ తల్లి! పంచప్రాణాలు తన బిడ్డలపైనే పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పిల్లల ఎదుగుదలను కోరుకుంటుంది. అలాంటి తల్లికి ప్రేమ లేదని ఏదో చిన్నచూపు చూస్తున్నారనే భావన కలిగించుకోకండి తల్లిదండ్రులకు మనస్థాపాన్ని కలిగించి తల్లి దండ్రులపై నిందలు వేసి మీరు ఏదో ఆవేశాలతో ఆత్మహత్యలు చేసుకోకండి తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించకండి. మారాలి సమాజం కలగాలి మీలో మంచి చైతన్యం, ఉత్తమ పౌరులుగా దేశాన్ని ఉద్ధరించాలి కానీ అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోకూడదు. మీకు ఎంతో ఉత్తమైన భవిష్యత్తు ఉంది అజ్ఞానంతో అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకోకండి. ముందు తరాల వారికి ఆదర్శంగా బ్రతకాలి. మంచితనంతో సాధించి బ్రతకాలి పిరికితనంతో చావకూడదు. చెడును నరుకుతూ మంచిని సాధిస్తూ నీకు నువ్వుగా గుర్తింపు తెచ్చుకోవాలి. ఇదే ప్రతి తల్లిదండ్రుల ఆశయం. ప్రతి సమస్య కి చావే పరిష్కారం కాదు.

కవిత

ఆ తల్లికి తీరని శోకం ఇచ్చావు
జీవితాంతం ఏడవమని ఆ తల్లిని శపించావు
ఆ తల్లికి తప్పులేని నిందను వేశావు
ఆ తల్లి రొమ్ము పాలు తాగావు
ఆ తల్లి ప్రేమను కాదన్నావు
ఆ తల్లి మనసు విరిచావు
నీ ఇరవై ఏళ్ల జీవితంలో
ఆ తల్లి మనసు అర్థం చేసుకోలేదు
ఆ తల్లి పెట్టిన గోరుముద్దలు మరిచావు
ఆతల్లి నిమిషమైనా నిన్ను విడువ లేదే
ఆ తల్లికి నీ జ్ఞాపకాలను మిగిల్చావు
ఆ తల్లికి పుత్రశోకం పెట్టావు
తల్లికి మరువలేని జ్ఞాపకంగా మిగిలావు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!