ఉక్కుసంకల్పం 

ఉక్కుసంకల్పం

 

                                                                                                               రచయిత:వి విజయశ్రీదుర్గ 

ఓ కార్మికులారా ఇకనైనా మేలుకొనండి  
విశాఖ  ఉక్కు ఆంధ్రుల హక్కు 
ప్రైవేటీకరణ  ఎంత వరకు సబబు ??
రాజకీయ లబ్ది కోసమేగా ఈ మార్పు… 

ప్రభుత్వాలు దిగివచ్చేనా ఆలోచించండి 
బంద్లు ధర్నాలు లాభించేనా కేవలం తాటాకు మంటవలె
ధర్నాలు  బంద్లతో మార్పు వచ్చేనా ..

ఎవరికి ప్రయోజనం కాని వ్యూహరచనలు 
సొంత లాభం కొంత మానుకుని ప్రభుత్వం  
ప్రణాళికలను రూపొందించలేదా  
శ్రమయే  జీవనంగా  జీవిస్తున్న కార్మికులు
లాభపడేలా ఆలోచించేవారెవరు …

కణకణమండే అగ్నిశిఖరంలా ప్రతి కార్మికుడు కదం తొక్కాలి

కొలిమిలోన కాలుతున్న ఉక్కువలే నిద్రలేవాలి..

 రాజకీయలబ్ధి కోసం కాక ఉద్యమం 

ఆవేశం ఆక్రోశం ప్రజా నేతల గుండెల్లో దడ పుట్టాలి 
కలసికట్టుగా చెయ్యి చెయ్యి కలుపుకుంటూ ఉద్యమించాలి …

ఆనాడే ఉక్కు సంకల్పం విజయం తథ్యం…! 

 

 

You May Also Like

One thought on “ఉక్కుసంకల్పం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!