పున్నమి చంద్రుడు

పున్నమి చంద్రుడు

 

రచయిత: స్వాతి తంగల్లపల్లి

 

చందమామ చేరువైతే 

చిలిపి రహస్యాలు 

తన చెవిన వేస్తా

 

తనంటే ఎందుకో 

అందరికీ ప్రేమే కదా

జాబిల్లని ఒకరు

వెన్నెలనీ ఇంకొకరు

చందమామని మరొకరు

లోకం మొత్తం

తన ప్రేమ మత్తులో

తూగుతుంది

 

ఊయాలేమి కట్టలెదతను

అయినా తననీ చూస్తే చాలు

గాల్లోనే ఊగుతుంటారు 

ఊహల ప్రపంచంలో

వ్యధలన్ని మరిచి

ఆనంద వెలుగుల్లో

చిరునవ్వు విరిసి

 

ఎప్పుడు తనని

చూసి ఆనందిస్తుంటా 

అందుకే నా ఊహాలన్ని

మూటకట్టి తనకి

చేరవేయాలి అనుకున్నా

 

నా అక్షరాల చుక్కల్ని 

తనకోసం పర్చుతున్నా

మరి తారలకు 

వెలుగులు అద్దె 

తనకి అవేగా కానుక

 

ముంగురులతోనే

నిచ్చెనలేస్తున్న

జాబిల్లిని చేరి 

చుట్టెయ్యాలని

 

తెల్లని వెలుగులు

కురిపిస్తూ

చల్లని ఊసులతో

పలకరిస్తూ

ప్రేమ మైకంలో

నన్ను పడేస్తూ

తన వైపు 

తిప్పేసుకుంటున్నాడు మరి

You May Also Like

One thought on “పున్నమి చంద్రుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!