డిప్రెషన్

డిప్రెషన్

రచయిత:ప్రసాదరావు రామాయణం

ఆమె

ఆ వంతెనపైన

ఒంటరిగా

మౌనంగా

భయ విహ్వలై

కూర్చొనుంది

చీకటి రక్కసి

ఆమేనక్కడకు నడిపింది

 

ఛాతీని చీల్చి

రక్తాన్ని.పీల్చి

వెలికి గుండెను తీసి

ముక్కలుగా కోయడం

రక్కసులకు

వెన్నతో పెట్టిన విద్యని

ఆమెకు బాగా తెలుసు

 

అవి ఆచటనే ఉండేవి

ఒక్కోసారి కనుమాటౌతాయి

ఛాయామాత్రంగా వెనుక ఉంటాయి

సమయంకోసం వేచిచూస్తూ

 

ఈ రాకాసి వినాశిని

ఆమెకు తెలుసు

జీవితాన్ని కూల్చివేస్తుందనీ

ఆమెను ద్వేషిస్తుందనీ…

అప్పుడప్పుడూ…

ఆమెను ఆమే ద్వేషిస్తుంది

 

ఈ రాక్షసులను చూడలేము

కాకమ్మ కథలలో వారు కాదు వీరు

మన మస్తిష్కంలో మాటువేసి ఉంటాయి

క్రూరత్వం మాత్రమే వెలికి వస్తుంది

 

వంతెనపై లేచి నిలుచుంది

అంచుకు జరిగింది

అంతం చెయ్యాలని పోరాటం

క్షణమాగింది

ఆలోచించింది

పోరాటాన్ని రేపు రాత్రికి

వాయిదా వేసి

వెనుతిరిగింది

(Depression ను రక్కసిగా చూప బడ్డది )

You May Also Like

3 thoughts on “డిప్రెషన్

  1. ఇప్పుడు ఎంతోమందిని పట్టి పీడిస్తున్న భూతం ఈ డిప్రెషన్. చాలా బాగా చెప్పారు👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!