సఖియా

సఖియా

 

నా మనసు నిండిన రూపం నీది

నా ఆశలు పంచుకున్న హృదయం నీది

 

నేనంటూ తలచుకున్న ప్రతిసారి

నాలో పలికే భావం నీది

 

చెప్పలేని ఊసులన్నీ పంచుకునే

 ఆత్మీయబంధం నీది

 

నువ్వు నా చెంతనున్న లేకున్నా

నిన్ను దాటి నేను పోగలనా

 

నువ్వు చెప్పే ఊసుల కోసం

అనుక్షణం ఎదురుచూసే మనసే నాది

 

నువ్వు పంచె ప్రేమ కోసం

ప్రాణమైన వదిలే ఇష్టం నాది

 

నువ్వు పిలిచే పిలుపు కోసం

వేల వేల ఎదురుచూసిన క్షణాలు నావి

 

నువ్వు అవునన్నా కాదన్నా

నిన్ను దాటి నేను పోగలనా

 

నువ్వు దూరమైన మరుక్షణం

నేను ఊపిరితో మనగలనా….

రచయిత::తపస్వి

You May Also Like

6 thoughts on “సఖియా

  1. మనస్సు ను తాకే మరుమల్లే మాల ..
    మీ అక్షర సుమమాల…
    చాలా చాలా బాగుంది సర్👌👌👌👏🏻👏🏻🌹🌹

  2. Wow చాలా చాలా బాగుంది.
    మనస్సు తాకే మరుమల్లెల మాలిక, మీ అక్షర సుమమాల.
    గ్రేట్ సర్👌👌👏🏻👏🏻🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!