వాలి సుగ్రీవులు

వాలి సుగ్రీవులు

రచయిత::తపస్వి

“మా ఎం. డీ .మిమ్మల్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నారు బావ” , రామ్ మాటకి ఆశ్చర్య పోవటం నా వంతు అయింది.

“మీ ఎం డీ నన్ను కలవాలి అనుకోవటం ఏంట్రా.”

“అంటే ఆయనకి నువ్వు తెలుసు అంట, మొన్న నా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూసి గుర్తు పట్టారు అంట..అందుకే నీకు ప్రోబ్లం లేదు అంటే వచ్చి నిన్ను కలుస్తా అన్నారు!”, రామ్ మాటలని బట్టి విషయం అతనికి తెలీదు అని వూహించాను.

“అతని పేరు ఎంటి?”, నేను తెలిసిన వ్యక్తుల్లో తను గుర్తు పట్టగలిగిన మనీషా కాదా, అని ఆలోచించా, కానీ గుర్తు పట్టే అవకాశం ఉండి ఉంటే మొన్న రామ్ పెళ్లి సమయం లో పరిచయం చేసినపుడే గుర్తు పట్టేవారు కదా..అంటే తను అతనికి తెలుసు కాని ,అతను తనకి తెలీదు.

“సరే ఈ ఆదివారం కుటుంబం తో ఇంటికి భోజనానికి రమ్మని చెప్పు”,”మీ అక్క ఒప్పుకుంటేనే రా బాబు..” అన్నా నవ్వుతూ.

“నేను మాట్లాడు కుంటాలె..”అని , కిచెన్ లో ఉన్న అక్క దగ్గరకి వెళ్ళాడు రామ్.

రామ్ , అక్కతో మంతనాలు జరిపిన సమయం లో ఆ  ఎం. డీ. తనకి తెలుసా??పోని తెలిసిన వాళ్ళ అబ్బాయా?ఇలా పలు విధాలుగా ఆలోచించా కానీ సమాధానం తట్టలేదు.

“అక్క ఓకె అంది బావ.”,అంటూ విజయ సూచిక చూపించాడు రామ్, నా ఆలోచనలు చెదరగొడుతు.

ఆ మేనేజర్ వచ్చి నన్ను కలవాలి అనటం ఎంటో, వీడి సంతోషం ఎంటో అనుకుంటూ..ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను, అతను వచ్చిన రోజే తెలుస్తుంది కదా ..ఆ కథ ఎంటో అనుకుంటూ.

    ***______****___********_____***

   ఆదివారం రానే వచ్చింది….అసలు ఎం డీ ఎందుకు బావ నీ కలవాలి అనుకుంటున్నాడు అని రామ్, తనకి ఆ మేనేజేర్ కి ఉన్న పరిచయం ఏంటో అని రవి ఇన్ని రోజులు పక్కన పెట్టిన, అనుకున్న సమయం వచ్చేసరికి సమాధానాల కోసం ఎదురు చూడ సాగారు….

మేనేజర్ తన భార్య, బాబు తో రావటం..రామ్ , రవి భార్య వాళ్ళ ఇద్దరినీ సాదరం గా ఆహ్వానించి హాల్లో లో కూర్చోపెట్టి , రవి ను పిలిచారు…

తన బెడ్రూం లో ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్న రవి , వారి పిలుపుకి ఫోన్ పెట్టేసి వచ్చాడు.

రవి నీ చూడటం తోనే మర్యాద పూర్వకంగా లేచి విష్ చేశాడు రఘు(మేనేజర్), రఘు అల చేయటం అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా రఘు భార్య కి కూడా ఆశ్చర్యం అనిపించింది..

“బాగున్నారా, సారీ ఆ రోజు పనుల ఒత్తిడిలో మీతో ఎక్కువ సేపు మాట్లాడటం కుదరలేదు”,మాటలు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి అని మొదలు పెట్టాడు రవి.

“కలవటానికి ఒప్పుకునందుకు థాంక్స్ సర్.”అంటూ చెయ్యి అందించాడు రఘు.

“కూర్చోండి”అంటూ తాను కూర్చున్నాడు రవి.

“మీరు మాట్లాడుతూ ఉండండి నేను ,అక్క భోజనాలు ఏర్పాట్లు చూస్తాము “అంటూ రామ్ అక్కడ నుండి కదిలాడు..

“చెప్పండి ఏదో మాట్లాడాలి అన్నారు అంట!”,డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాడు రవి.

“మీరు నన్ను గుర్తు పట్టారా?” , రఘు ప్రశ్నకి, “సారీ, రామ్ చెప్పినప్పటి నుండి ఆలోచిస్తున్న కానీ గుర్తు రావటం లేదు.”సమాధానం ఇచ్చాడు రవి.

“మీకు నేను ఒక విషయం లో సారీ చెప్పాలి..అలాగే థాంక్స్ కూడా చెప్పాలి..”నవ్వుతూ అన్నాడు రఘు.

అర్థం కానట్టు చూసాడు రవి.

” నేను బిందు ఇంటర్ క్లాస్ మేట్ ను సర్”,అయిన రవి గుర్తు పట్టలేదు అన్న విషయం అర్ధం అయింది రఘు కి.

“ఇంటర్ అయ్యాక , ఎమ్సెట్ కోచింగ్ టైమ్ లో ఒక బ్యాచ్ బిందు నీ ఏడిపించారు.ఆ సంఘటన గుర్తు ఉందా సర్”, ఆ మాట కి రవి 15 సంవత్సరాలు క్రితం జరిగిన ఆ సంఘటన గుర్తు తెచ్చుకోవటం కోసం గతం లోకి వెళ్ళాడు.

**———–**——-**——*

      అది తను ఇంజనీరింగ్ 3 వ సంవత్సరం లో ఉన్నపుడు జరిగిన విషయం.

వేసవి లో ఆదివారం రోజు తను ,తన స్నేహితులు క్రికెట్ ఆడుతుండగా ,కాలేజి నుండి బిందు ఫ్రెండ్ తనకి కాల్ చేసింది. క్లాస్ లో బిందు నీ ఎవరో దారుణం గ ఏడిపించారు అని , ఎదురు తిరిగి మాట్లాడితే , ఏం చేయగలవు అంటూ ఇంకా అడ్డదిడ్డంగా గా మాట్లాడారు అని.

అది విని నాకు కోపం రావటం..ఏమైంది అని నా ఫ్రెండ్స్ అడగటం , నేను విషయం చెప్పటమే ఆలస్యం అందరూ బ్యాట్స్, వికెట్లు , కర్రలు పట్టుకుని బండ్లు తీసి కాలేజి కి వెళ్ళటం అయింది.

మేము వస్తున్నాము అని చెల్లి, తన ఫ్రెండ్స్ బయట ఉన్నారు మా కోసం చూస్తూ.అప్పటికే ఏడ్చి ఏడ్చి బిందు ముఖం ఉబ్బిపోయింది..

అసలు ఎందుకు సమస్య మొదలు అయింది అని నేను కనుక్కున్న.

బిందు కి ,క్లాస్ లో ఉన్న శివ అనే అబ్బాయికి ఎఫైర్ ఉంది అని..హాస్టల్ బాయ్స్ కొంతమంది క్లాస్ రూం బోర్డ్ మీద అసభ్యంగా రాశారు , అడిగితే చాలా అసభ్యంగా గా మాట్లాడారు అని చెప్పింది .

నిజంగా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమ ఉందా అని అడిగాను నా చెల్లిని.

క్లాస్మేట్ కదా అంతా వరకే ..అనవసరం గా వాళ్ళు వాళ్ళు బాయ్స్ మధ్య ఉన్న గొడవలకి నన్ను మధ్యలోకి లాగారు..శివ అనే అబ్బాయికి , ఈ అబ్బాయిలకి హాస్టల్ లో ఏవో గొడవలు అని చెప్పింది..

సరే టీనేజీ పిల్లలు మామూలుగా సర్ధి చెబుదాము కదా అని నేను అనుకున్న.ఎందుకంటే అది నేను చదువుకున్న కాలేజి, పైగా ప్రిన్సిపల్ మాకు దూరపు బంధువు.

సర్లే నేను సర్ధి చెబుతలే అన్న, ఆ ఇష్యూ పెద్దది చేయటం ఇష్టం లేక.

“ఏం చెబుతావు అన్నయ్య, కంప్లైంట్ ఇస్తా అంటే..కంప్లైంట్ కాకపోతే పోయి నీ బాబు కి చెప్పుకో ఏం పీకుతాడో చూస్త అన్నాడు వాడు”అంటూ అప్పుడే హాస్టల్ నుండి క్లాస్ రూం కి వెళ్తున్న ఒక అబ్బాయిని చూపిస్తూ…

ఆ మాట కి నాకే కాదు..నా ఫ్రెండ్స్ కి కూడా ఒళ్లు మండింది….మా బాబు..అంటే మా నాన్న ఆయన ముందు గట్టిగా మాట్లాడటానికి మంత్రులైన ఆచి తూచి మాట్లాడతారు, అలాంటిది ఒక పిల్లాడు అల మాట్లాడాడు అంటే వచ్చే కోపం సమంజసమే కదా.

“వాడికి భయం అంటే ఎంటో తెలీదు అంట అన్న, వాడికి మళ్లీ అమ్మాయిని చూసి మాట్లాడాలి అన్న ఆ భయం పోకూడదు.”, నా చెల్లి అవేశం గా అన్న ఆ మాటలు పూర్తి అయ్యేసరికి  ,అటు వెళ్తున్న ఆ కుర్రాడిని పట్టుకున్నారు. నా ఫ్రెండ్స్ కాస్త మొరటు వాళ్ళు, అవేశం కోపం ఎక్కువ..నేను అన్న  , మా కుటుంబం అన్న అభిమానం ప్రేమ ఎక్కువ.

అప్పటి దాకా సరే చిన్న వాళ్ళు ఏదో తెలియని తనం తో సరదాగా అల్లరి గా చేసి ఉంటారు లే కాస్త సర్ధి చెబుదాము అనుకున్న మాలో కోపం కట్టలు తెంచుకుంది…

అప్పటికే మా చుట్టూ అలజడి మొదలు అయింది, ఏం జరుగుతుందో అన్న ఆసక్తి తో చాలా మంది స్టూడెంట్స్ నుంచుని చూస్తున్నారు..రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళు నిలబడి మమ్మల్నే చూస్తున్నారు…

“ఏరా బిందు నీ ఏడిపించింది నువ్వేనా…”మాట తో పాటే ఆ అబ్బాయి చెంప మీద దెబ్బ కూడా పడింది.

అది నేను ఊహించలేదు , కానీ నా ఫ్రెండ్ నాగు కి కూడా నాలాగే ఆవేశం ఎక్కువ..మాటతో పాటే దెబ్బ వేయటం వాడికి అలవాటు..

తగిలిన దెబ్బకి దిమ్మతిరిగి కూలబడ్డాడు ఆ కుర్రాడు..

నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు వెళ్లి వాడి చొక్కా పట్టుకుని పైకి లేపారు..

“నువ్వొక్కడివే న, ఇంకెవరైనా ఉన్నారా నీతో..”, ఆ పిల్లాడి సమాధానం కోసం చూడకుండా మళ్లీ ఒక్కటి వేశాడు…

భయం..బాధతో నొప్పితో ఏడుపు అందుకున్నాడు ఆ కుర్రాడు…

అక్కడ మమల్ని ఆపే ధైర్యం కానీ అడ్డు వచ్చి నిలబడే దైర్యం కానీ ఎవరికీ లేదు..అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గర నుండి అందరికీ మేము మా కుటుంబం ఏమిటో బాగా తెలుసు…

“హాస్టల్ లో ఉన్నారు…”నాగు మూడో దెబ్బ వేయలనుకునే లోపు నోరు విప్పాడు ఆ కుర్రాడు..

“పద చూపించు..” అంటూ వాడి చొక్కా పట్టుకుని వెళ్తూ , “బావ..నువ్వు చెల్లిని ఇంటికి పంపించు ఈ లోపు ” అన్నాడు నాగు…

ఇది పెద్ధతి అవుతుంది అని తెలుసు కాని , పరిస్థితి చెయ్యి దాటి పోయింది..నాగు కాకపోయినా వాళ్ళు వాగిన వాగుడుకి నేను అయిన కొట్టేవాడని…

నేను చెల్లికి , తన ఫ్రెండ్స్ కి సర్ధి చెప్పి ఇళ్ళకి వెళ్ళమని చెప్పాను..ఈ విషయం ఇంట్లో చెప్పవద్దు అని చెప్పా…ఇదే విషయం మా ఇంట్లో మా నాన్న దాక వెళ్తే పరిస్థితి ఇంకా దారుణం గ ఉంటుంది.

చెల్లి వాళ్ళు వెళ్లి నేను మళ్లీ కాలేజి దగ్గరకి వచ్చేలోపు ఒక అయిదుగురు కుర్రాళ్ళని చొక్కాలు పట్టుకుని లాక్కుని వచ్చి రోడ్డు మీద కూర్చోపెట్టాడు నాగు…

ఇక్కడ ఎదో పెద్ద గొడవ అవుతుంది అని అర్థం అయ్యి జనాలు పోగవ్వటం మొదలు అయింది..

“ఇక్కడ ఇలా వద్దురా …”అన్నాను..ఎంతైనా కాలేజి పరువూ పోతుంది అని…

“సరే , వీళ్ళని బండ్లు ఎక్కించండి రా…”నాగు అనటం వాళ్ళని అందరినీ , బైక్ ఎక్కించటం మేము అక్కడ నుండి కదలటం జరిగిపోయింది.

పావు గంట మా ప్రయాణం తరువాత ఊరికి చివర ఒక ఖాళీ ప్రదేశం లో మా బల్లు ఆగాయి..

ఈ పావుగంటలో ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎంటో అర్థం చేసుకోగలను…

కానీ నేను చేయగలిగింది ఏమి లేదు ఇపుడు , ఆపాలి అంటే మొదటి దెబ్బ పడిన క్షణమే ఆపాల్సింది, కానీ వాళ్ళు నా చెల్లిని అనటమే కాక మా కుటుంబాన్ని అవమాన పరిచాడు అన్న కోపం ఈగో నన్ను ఆపకుండా చేసింది మరో ముఖ్య కారణం ఈ రోజు ఒక పిల్లాడు నోరు ముయుంచలేక సర్ధి చెబితే రేపు ఈ కాలేజి పిల్లల నోరు వల్ల ఈ వార్త ఊరు అంతా వ్యాపించి మా కుటుంబ గౌరవం తగ్గిధి అన్న భయం.

బైక్ లు ఆగటం అందరినీ ఒక చోట ఎర్రని ఇసుకలో బట్టలు ఊడదీసి కూర్చో పెట్టడం క్షణాల్లో జరిగిపోయింది..తీయను అనవాడిని చేతికి దొరికిన కర్రతో కొట్టడం తో భయం తో భిక్కచచ్చి ఏడుస్తూ..బ్రతిమాలు తు గుడ్డలు తీశారు…

నేను నిస్సహాయంగా వాళ్ళని చూడటం తప్ప ఇంకేమీ చేయలేక కాస్త దూరం గా నిలబడి ఉన్నాను..మా ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉంచాము.

చేతికి దొరికిన కర్రలతో ..చేతులతో ఆ అయిదుగురు ని ఇష్టం వచ్చినట్టు చితక బాదారు మా కుర్రాళ్ళు ఒకరి తరువాత ఒకరు. ఆ పిల్లల ఆక్రందనలు వినలేక ఒక అరగంటకు ఇక ఆపాలి తప్పదు అని దగ్గరకి వెళ్ళ..అప్పటికే వాళ్ళ ఒంటి మీద వాతలు తేలాయి ..ఆపకుండా ఏడుస్తూనే ఉన్నారు  ప్లీజ్ వదిలేయండి , తెలియక చేశాం అంటూ…

“ఇక చాలు లేరా …చస్తారు “అన్నాను నాగు కి వాటర్ అందిస్తూ…

బాటిల్ అందుకున్న నాగు “హ్మ్మ్…”అని , “బట్టలు  తీసుకోండి “అన్నాడు వాటర్ తాగి.

పది నిముషాలకు ఆ కుర్రాళ్ళు బట్టలు వేసుకుని కూర్చుని ఉన్నారు..పైకి ముఖం మీద తప్ప లోపల అంతా దెబ్బలు ..పాపం ఎలా భరించారో అన్న ఆలోచనకి , దీనికి నేను ఒక కారణం కదా అనిపించింది…

” ఈ రోజు వీళ్ళని సరే చిన్న పిల్లలు కదా అని మనం జాలి పడి వదిలేస్తే  , ఆ ఇంత పెద్ద వాళ్ళని అంటేనే ఏమి పీకలేకపోయారు అన్న పొగరు తో రేపు ఎవరినైనా ఎప్పుడైనా సరే ఎదైన చేసే సాహసం కూడా చేస్తారు…ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు ర అవకాశం దొరికితే అమ్మాయిలను బొమ్మల్లా చేసి హింసించి ఆడేది… ఏడిపించేది…”, నాగు మాటలు ..అవేశం అర్థం చేసుకోగలను; తన అక్క ని ఇలాగే ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు ఏడిపిస్తూ ఆటపట్టిస్థు నలుగురిలో అవమానం చేయటం వల్ల అది భరించలేక తను ఆత్మహత్య చేసుకుంది…అప్పటి నుండి వీడు ఎవరన్నా అమ్మాయిని బాధపెట్టడం చూస్తే చాలు ఇలా వైలెంట్ గా రేయాక్ట్ అవుతాడు….

“రేయ్ వీళ్ళని రెఢీ చేయండి…”,నాగు మాటలకి అందరి కి తల దువ్వి .. పౌడేర్ రాసి వరుసుగా నిలబెట్టారు…

“తీసుకెళ్ళి దించి ఇంటికి వచ్చేయండి”, చెప్పి, నేను నాగు అక్కడ నుండి బయల్దేరాము….

     **———-***————–**

ఇంట్లో కి అడుగు పెడుతుండగా నే బిందు ఎదురు వచ్చింది…

“ప్రిన్సిపల్ ఇంటికి వచ్చారు అన్నయ్య “అంటూ…

“నాన్న కి విషయం తెలుసా…”, తెలిస్తే అయన ఏమంటారో అన్న చిన్న ఆలోచన…

“లేదు…నేను ఇంటికి వచ్చేస కదా…జరిగిన విషయం తెలిసి ప్రిన్సిపాల్ కి భయం వేసి , నేను ఏమన్నా ఇంట్లో చెప్పాను ఏమో అని వచ్చారు …ఇంకా చెప్పలేదు అని తెలిసి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేశారు…మీకు ఫోన్ చేయమన్నారు పిల్లలని తీసుకెళ్లారు కదా..భయం తో…” బిందు మొహం లో కూడా చిన్న టెన్షన్..

“వాళ్ళని హాస్టల్ లో వదిలేసి వచ్చాం..కంగారు పడకుండా ఉండు..నాన్న కి తెలియకూడదు..”చెప్పి నేను లోపలకి భోజనానికి వెళ్లి కూర్చున్న…

*__****___********_______***___**

“బావ అక్క భోజనం కోసం రమ్మంటోంది…”పిలుపు వినబడే సరికి ఆలోచనలు చెదిరి ఈ లోకం లోకి వచ్చాను…

“రండి భోజనం చేసి తరువాత మాట్లాడుకుందాం..”అంటూ కాస్త మొహమాటం గానే లేచాను…ఆ రోజు అవేశం కోపం..వయసు ఉడుకు రక్తం వల్ల అల చేసి ఉండొచ్చు కానీ కొన్ని సంవత్సరాలు తరువాత అల చేసి ఉండకూడదు అన్న ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉంది…కానీ అప్పటి పరిస్థితుల్లో అల జరిగి పోయింది..దాన్ని మార్చలేము….కానీ ఈ క్షణం తన ముందు నవ్వుతూ కూర్చున్న రఘు ని చూస్తూ ఉంటే ఎక్కడో చిన్న ఇబ్బంది కర పరిస్థితి…ఆ నవ్వు తనకి నచటం లేదు..ఆ నవ్వు స్థానం లో కోపం ద్వేషం కదా ఉండాల్సింది…ఒకవేళ తానే రఘు స్థానం లో ఉండి ఉంటే చేసిన అవమానం పైన ప్రతీకారం ఖచ్చితం గా తీసుకునే వాడు..మరి ఈ కుర్రాడు మాత్రం ఇలా నవ్వుతూ థాంక్స్..సారీ అని ఎలా అంటున్నాడు??

ఆలోచిస్తూనే బోజనల్లో నిమగ్నం అయ్యాము….

ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరం  ఇబ్బందిగా చూసుకుంటూ నే భోజనాలు కానిచ్చి…మళ్లీ రూం లో కూర్చున్నాము…

“మీకు నేను ఎందుకు థాంక్స్.. సారీ చెప్పాలి అనుకుంటున్నాను అని బాగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు…?”, గదిలో నిశబ్దాన్ని తోలుతు అన్నాడు రఘు…

గదిలో ఇద్దరం మాత్రమే ఉన్నాను…

“క్షమించు..!”పెదవుల దాక వచ్చింది కానీ..దాటలేదు..నిజమే దాటదు..నాకున్న ఈగో కి…

“సారీ ఎందుకు చెప్పాలి అనుకున్నాను అంటే సర్, ఆ వయసులో అల సరదాగా ఏడిపించడం హీరో లాగా అని గొప్పగా ఫీల్ అయ్యాను కానీ జరిగింది అంత తెలిసి మా ఇంట్లో నేను చేసిన గొడవకి మా నాన్న గారు కూడా ఆవేశంగా మిమల్ని ఏదోకటి చేయాలి అని అనుకున్నారు కానీ, మీకు తెలిసే ఉంటుంది కదా, మీలాగే నాది రాజకీయ కుటుంబం..

మా అమ్మ మాత్రం ఒక్కటే అడిగింది, మీ అవేశం కోపం కరెక్ట్ కానీ అదే పని మన కూతురుకి జరిగి ఉంటే ఏం చేసేవారు అని…

మా సమాధానం చంపేస్తాం!!!

ఆ క్షణం మేము ఇచ్చిన సమాధానం కి మా అమ్మ చూసిన చూపు…దాని అర్థం ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు సంతోష పడు అని!

ఆ చూపు వెనుక దాగి ఉన్న ఆ మాట అర్థం అయిన తరువాత నేను చేసిన తప్పు..ఆ తప్పు వల్ల పడ్డ శిక్ష..

అప్పట్ దాక నేను మా నాన్న గారి పేరు..పలుకుబడి..చూసి మీలాగే ఆలోచించే నేను..మా అమ్మ ఆ చూపు వల్ల మారాను…నేను చేసిన తప్పు ఎంత పెద్దది అని అర్థం అయింది..

అందుకే మీకు క్షమాపణ చెప్పాలి అనుకున్నాను..

ఇక పోతే థాంక్స్ కూడా అందుకు..నేను ఎలా ఉండకూడదు అని ఆ రోజు జరిగిన సంఘటన వల్లే నాకు అర్థం ఐంది..బహుశా లేకపోతే నేను కూడా ఏడిపించడం..గొడవలు.కొట్లాటలు ఇవే హీరో ల చేయటం గొప్ప అని అనుకునే వాడిని అనుకుంటాను..

కానీ ఆ సంఘటన తెచ్చిన మార్పు వల్ల నేను బాగా చదువుకుని, ఈ రోజు ఇలా కంపెనీ పెట్టి మంచి లైఫ్ లీడ్ చేస్తున్న ..సో అందుకు మీకు  కృతజ్ఞతలు…”

రఘు చెప్పిన మాటలు ఎందుకో ఎక్కడో నాలో ఒక చిన్న మార్పుని మొదలు పెట్టాయి..

ఎందుకో చాలా సార్లు ఆ సంఘటన తలుచుకుని బాధ పడ్డాను కానీ…మళ్లీ వాళ్ల గురించి అడగటం కానీ..ఏమి చేయలేదు…

“ఏమండీ వెళ్దామా…”గదిలోకి వచ్చింది రఘు భార్య..

“సరే సర్..ఇక వెళ్తాము..మీ అతిద్యానికి కృతజ్ఞతలు.., ఇప్పుడు ఎందుకో చాలా తేలికగా ఉంది నా మనసు..ఉంటాను సర్..”అంటూ లేచాడు రఘు…

నవ్వుతూ పైకి లేచాను నేను కూడా సోఫా లో నుండి..

“వెళ్ళొస్తా ము సర్…”అంటూ భార్య భర్తలు ఇద్దరూ నమస్కరించి కదిలారు…

“సారీ రఘు…”నా పెదవులని దాటి మాట బయటకి వచ్చింది కానీ, ఆ మాట వారిని చేరలేదు…

తలుపు మూసుకు పోయింది…

మళ్లీ ఈగో తో నా మనసు కూడా మూసుకు పోయింది…

ప్రతి తప్పు వెనుక ఒకరి దృష్టిలో ఒప్పు ఉంటుంది..

ప్రతి ఒప్పు వెనుకాల మరొకరి దృష్టిలో తప్పు ఉంటుంది….

బహుశా మా జీవితాల్లో వచ్చిన మార్పులు అవే…

ఈ సారి మళ్లీ పిలిచి సారీ అడగాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాను…

ఇపుడు నా మనసు చాలా తేలికగా ఉంది..కారణం నేను కూడా ఒప్పు అనుకుని చేసిన ఆ తప్పు ను భారం గా ఇన్ని రోజులు మోస్తూ ఉన్న కాబట్టి…!!!

***

 

You May Also Like

5 thoughts on “వాలి సుగ్రీవులు

  1. మంచి సందేశాత్మకంగా స్టోరి. బాగా వ్రాసారు. 😊💐💐

  2. బాగుంది సర్ స్టోరీ..కానీ మీరు అప్పుడు ఒప్పు అని తప్పక చేసిన విషయం వాళ్ళకి మంచే చేసింది కదా..మరి మీరు తప్పేమో అని ఇన్నాళ్లు మోసిన భారం ఒప్పని తెలిసి ఎందుకు సారీ చెప్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!