అందమైన బొమ్మ (పడతి)

అందమైన బొమ్మ (పడతి)

రచయిత:: సుశీల రమేష్.


అందమైన బొమ్మా  !

అందాల భరిణ వమ్మా  !

పుట్టింది మొదల అపురూపంగా చూస్తారమ్మా !

నీవు లేని ఇల్లు ఇల్లు కాదమ్మా !

నీ ఆట పాటలు చూడలేని కళ్ళు ఎందుకమ్మా !

నీ పలుకు వినలేని చెవులు ఎందుకమ్మా !

తండ్రి హృదయ సామ్రాజ్యానికి  మహారాణివమ్మా  !

తల్లి కలల పంట వమ్మా!

అరిటాకు నని, అబలనని బాధ పడకమ్మా !

మాయ మాటల వలలో పడకమ్మా!

సెలయేరులా సాగిపోమ్మా !

పాప గా, చెల్లిగా, అలిగా, తల్లిగా

పదవులు ఉన్న ఆదిశక్తి వమ్మా !

సృష్టికి మూలం నీవమ్మా !

ప్రేమకు ప్రతిరూపం నీవమ్మా !

అపర కాళిలా మారిన వేళ నిన్ను

ఎవరు తాళగలరమ్మా !

మౌనం ఎందుకమ్మా !

మౌనాన్ని అర్ధాంగీకారం అంటారమ్మా  !

నీకు అవగతం కాని విషయం ఏదమ్మా !

నీ ఆలోచన శక్తి అద్భుతమమ్మా !

నీకు ఏం కావాలో నీకు తెలుసమ్మా !

నీవు అబలవు కాదమ్మా !

ఆడ పులివమ్మా. !
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!