ఎక్కడమ్మా నువ్వు లేనిది

ఎక్కడమ్మా నువ్వు లేనిది

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జాధవ్ ముకుంద్ రావు

ప్రకృతి సిద్ధం చేసే కుసుమం ఇది
సుఖ దుఃఖలలో జీవిత నౌక తెలిసేది,
ఇళ్లంతా సూర్యరశ్మికి ఆనందం ఇది
ఎక్కడమ్మా నువ్వు లేనిది !!

నీ కష్టము లేని వ్యవసాయ ఫలమే లేనిది
ఎన్ని గోసాలనున్న ధైర్యంతో బలాన్ని పెంచేది,
ఎన్ని బాధలనున్నా బ్రతుకును నేర్పించేది
ఎక్కడమ్మా నువ్వు లేనిది !!

ఆకలిగా మారావు క్షీరాన్ని పంచడంలో
చాకిరీతో పళ్ళు పులిసిన సాధించడంలో,
కుటుంబాన్ని ఆసరా తల్లి చిరునవ్వుల ఇది
ఎక్కడమ్మా నువ్వు లేనిది !!

నా మనసులో ప్రతిరూపం భావజాలంలో
జీవితంలో వచ్చే సమస్యల సారథ్యంలో
నా బడి అందమైన అక్షరాలను పలికించేది
ఎక్కడమ్మా నువ్వు లేనిది !!

నా ఆడే ఆటలలో నా పాడే పాటలలో
నా అంతరిక స్మరణ శక్తి వైభవము లో
మీ పాల అమృతమే నాకు కవచము ఇది
ఎక్కడమ్మా నువ్వు లేనిది !!

నా సంకల్పం పూజించే ప్రదర్శణములో
నా గుండెలు నడిచే శ్వాస ప్రక్రియలలో
చైతన్య బుద్ధి చేయూతను ఇచ్చేది
ఎక్కడమ్మా నువ్వు లేనిది !!

అనంతశక్తి అపూర్వ లోకంలో
నా జీవనయానం సాఫల్య చేయడంలో
నువ్వులేని నా శరీరం వైకల్యంము ఇది
ఎక్కడమ్మా నువ్వు లేనిది !!
***********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!