నా కలల తీరంలో

నా కలల తీరంలో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాధ ఓడూరి

అవని
తొలకరి జల్లుకై
ఎదురు చూసినట్లు
నీ రాకకై
నా ఎదురు చూపు

కానీ
నన్ను చూస్తే
నీ కనులు
ఆషాడ మాసాన
గర్జించే మేఘంలా
గర్జిస్తాయి

నా
కలలతీరంలో
నీకై
వెతికి వెతికి
అలసిపోతున్నాను

అయినా
ఎక్కడో చిన్న ఆశ
నీ మనసు పొరల్లో
చిక్కుకున్న నా మాటలు
నీ హృదయ సవ్వడికి
వినిపించగలవేమోనని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!