లే లే కదులు

లే లే కదులు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మహేష్ వూటుకూరి

ఎవరేమైనా  ఏదైనా అనుకోని
నీ ఆలోచన నీదై
నీ ఆచరణా నీవై
ఉడుంపట్టు పట్టి మొదలెట్టు
ఉడుకు రక్తం  ఉప్పొంగీ
దిగులు తనం జడుసుకునేలా
సాగించు నీ పయనం
సాధనతో  విజయంఎంత దూరమైనా
దగ్గరకు వచ్చేవరకు విశ్రమించకు.
ఎవరేమైనా ఏదైనా అనుకోని
అబద్దాన్ని ఆశ్రయించకు
అదృష్టానికై ఎదురుచూడకు
శ్రమను నమ్ముకో
స్వశక్తి పైనే ఆశక్తి పెంచుకో
నీలో ఏదో ఏమూలో దాగివున్న
ఆత్మవిశ్వాసాన్ని గుండెల్లో కి
ఆహ్వానించుకో
అనితర సాద్యాలన్ని
పాదాక్రాంతం చేసుకో
ఎవరేమైనా ఏదైనా అనుకోని
ఆత్మవంచన వైపు చూడకు
నిన్ను నీవు అదుపు తప్పకు
అత్యాశల అవకాశాలు
దారితప్పించాలని చూస్తాయి
పొరపాటుగానైనా తొంగి చూడకు
కృంగి పోతావు
నింగి అంతగా ఎదగాలంటే
ప్రతి క్షణం నిన్ను నీవు గమనించుకో
తప్పులను సవరించుకో
గొప్పలకు పొంగి పోకు
నిప్పులా బ్రతికేందుకు
అనుక్షణం తపించు
అరక్షణమైనా వృధాచేయకు
అత్యంత విలువైనది కాలం
అవకాశాలను ఒదులుకోకు
అవకాశాలను సృష్టించు
ఆశయాలను బ్రతికించు
నీవే మార్గంగా లోకం గుర్తించాలి
ఆ మార్గంలో ఎందరో  నడవాలి.
లే కదులు కడలిలా
లే  లే కదులు కాపలా కాసే సైనికుడిలా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!