నీ ప్రేమ కోసం

నీ ప్రేమ కోసం

రచన: మాధవి కాళ్ల

           అమ్మ నేను పద్మా  కాలేజీకి వెళుతున్నాము అని మధు వాళ్ల అమ్మకి చెప్పుతుంది. సరే మధు జాగ్రత్తగా  వెళ్ళండి అని సుశీల చెప్పింది. మధు పద్మా బస్ లో వెళుతున్నారు. బస్ లో ఒక అబ్బాయి పద్మా తో తప్పుగా ప్రవర్తించాడు. ఆ అబ్బాయికి  మధు తగిన బుద్ది చెప్పింది. తరువాత కాలేజీ దగ్గర బస్ దిగి కాలేజీ లోపలికి వెళ్లారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వస్తున్నారు విష్ణుపరిచీ . ఈ విషయం తెలిసి పద్మా ఎంతో  చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం గురించి మధుకి చెప్పింది పద్మా. ఓ అవునా అని ఊరుకుంది మధు.  కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ల తో మాట్లాడుతుంది మధు. పద్మా మాత్రం విష్ణుపరీచి కోసం ఎదురు చూస్తుంది. ఫంక్షన్ కి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కారు వచ్చి కాలేజ్ ముందు ఆగింది.  కార్లోంచి విష్ణుపరీచి దిగారు. ప్రిన్సిపాల్ లెక్చరర్స్ అందరూ లోపలికి ఆహ్వానం పలికారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాడు ఆ ప్రోగ్రాం లో మధు పాట పాడింది. మధు ని చూడగానే బాగా నచ్చింది విష్ణుకి. తర్వాత ప్రోగ్రాం అయిపోయింది.  ప్రోగ్రాం బాగా జరిగింది కదా మధు అని అడిగింది పద్మా.అవును పద్దు చాలా బాగా జరిగింది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది మధు. పద్మా కుండా వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చుంది మధు. అమ్మ టీ ఇవ్వు అని అడిగింది మధు వాళ్ల అమ్మనీ. ఐదు నిమిషాల లో మధుకి టీ ఇచ్చింది సుశీల.అప్పుడే ఆఫీస్  నుంచి  వచ్చి కూర్చున్నారు రామకృష్ణ.  ఎలా జరిగింది ఫంక్షన్ అని అడిగాడు రామకృష్ణ  మధుని. చాలా బాగా జరిగింది నాన్న అని చెప్పింది మధు. రేపు మార్నింగ్ మీ పిన్ని వాళ్లు వస్తున్నారు మధు అని చెప్పారు రామకృష్ణ. అవునా సరే నాన్న అని చెప్పి డిన్నర్ చేయడానికి పిలిస్తారు సుశీల. కాలేజీలో ఫంక్షన్ అయినా తరువాత ఆఫీస్ లో మీట్ కి వెళ్ళతాడు విష్ణు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. మధు గురించి ఆలోచిస్తుంటాడు. విష్ణుకి దేవ్ కాల్ చేసాడు. లిఫ్ట్ చేసి చెప్పు దేవ్ అని అడుగుతాడు విష్ణు.అది విష్ణు రేపు ఆఫీస్ లో ఇంటర్వ్యూ ఉంది కదా నువ్వు చేస్తావా నీ చేయాలా ఇంటర్వ్యూ అని అడుగుతాడు దేవ్ . లేదు దేవ్ నేనే చేస్తాను ఇంటర్వ్యూ అని చెప్పాడు విష్ణు. ఇంకొక ముఖ్యమైన విషయం ఈరోజు కాలేజ్ ఫంక్షన్ ఒక అమ్మాయి చూశాను. అమ్మాయి డీటెయిల్స్ రేపు మార్నింగ్ కల్లా నాకు కావాలిఅని చెప్పి కాల్ కట్ చేస్తాడు విష్ణు. మార్నింగ్ మధు పిన్ని వాళ్ళు వచ్చారు.వాళ్ళని పలకరించి అమ్మ నేను ఇంటర్వ్యూ వెళ్తున్నాను అని సుశీలకి  చెప్పింది మధు.సరే జాగ్రత మధు అని చెప్పారు రామకృష్ణ, సుశీల.. ఈవెనింగ్ షాపింగ్ కి వెళదాము అని చెప్పి రామక్రిష్ణ ఆఫీసుకి వెళ్ళతారు.. ఇంటర్వ్యూ కోసం  ఆఫీస్ కి వచ్చింది మధు. అప్పుడే ఆఫీసుకు వచ్చిన విష్ణు మధు ని చూసి కొంచెం షాక్ అయ్యాడు. అందరికీ ఇంటర్వ్యూ  చేశారు. లాస్ట్ లో మధు వెళ్ళింది సెలెక్ట్ అయింది. జాబ్  వచ్చినందుకు  చాలా హ్యాపీ తో థాంక్యూ సర్ థాంక్యూ సోమచ్ అని చెప్పింది విష్ణుకి . రేపటి నుంచి మీరు ఆఫీసులో  జాయిన్ అవ్వండి అని చెప్పాడు.మధు ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళుతుంది. దేవ్ వచ్చి నువ్వు అడిగిన అమ్మయి డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చాడు విష్ణుకి . అవసరం లేదు దేవ్ ఆ అమ్మాయే మా ఆఫీస్ కే వసుంది అని దేవ్ కి చెప్పాడు .సరే విష్ణు అని చెప్పి వెళ్ళపోయాడు దేవ్. ఈవెనింగ్ అందరూ షాపింగ్ కి బయలుదేరతారు. షాపింగ్ కాంప్లెక్స్ చేసి బయటనే డిన్నర్ చేసి ఇంటికి వచ్చి నిద్రపోతారు..మధు పిన్ని వాళ్ళు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతారు. పెళ్లి కి అందరినీ పిలిచి వెళ్ళిపోతారు..

మధు ఆఫీస్ కి వెళుతున్న అని చెప్పి వెళ్ళిపోయింది సుశీల కి. ఆఫీస్ లో ఫస్ట్ రోజు కాబట్టి ఎక్కువ వర్క్ ఇవ్వలేదు మధుకి.  రోజంతా మధునీ చూస్తేనే ఉన్నాడు విష్ణు. ఆఫీస్ లో కొలీగ్ పెళ్లికి అందరినీ పిలిచాడు విష్ణు తో సహా. సరే అని దేవ్ విష్ణు కలిసి వెళ్తారు పెళ్లికి. మధు ఆ పెళ్లి కి వెళ్ళకుండా పిన్ని వాళ్ళ పెళ్లి కి వెళ్తుంది. పెళ్లి లోన ఆఫీస్ కొలీగ్స్ చూసి షాక్ అవుతుంది మధు. ఏంటి దేవ్ సార్ మీరు ఇక్కడ అని అడిగింది మధు.మా ఆఫీస్ లో కొలీగ్ పెళ్లి కదా. ఆ పెళ్లి కే  వచ్చాము.కానీ ఏంటి ఇక్కడ అని మధు ని అడిగాడు దేవ్.మా పిన్ని కూతురు పెళ్లి అందుకే వచ్చాము సార్ అని చెప్పింది మధు.అవునా సరే సార్ పని ఉంది వెళ్ళుతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది మధు. విష్ణు వచ్చి ఏంటి మధు ఇక్కడ అని అడిగాడు.ఈ విషయం చెప్పాడు దేవ్ .విష్ణు చాలా హ్యాపీగా అవునా అని అడిగాడు.అవును అని దేవ్ కొంచం గట్టిగా చెప్పాడు.   పెళ్ళికి వచ్చిన అతిధులకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. తర్వాత రోజు ఉదయం మే  పెళ్లి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.మార్నింగ్ అందరూ రెడీ అయ్యి పెళ్లి మండపంకి వచ్చారు. అన్ని కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి పెళ్లికూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టేశారు అందరూ ఆనందంతో ఉన్నారు .
అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు .తింటున్నాడు సంతోషంగా. తరువాత సాయంత్రం అప్పగింతలు చేశారు.. చాలా బాధపడ్డాను పెళ్లి కూతురు పెళ్లి కూతురు తల్లిదండ్రులు ముఖ్యంగా మధు.. పెళ్లి వాళ్లతోనే విష్ణు  , దేవ్ మిగతా కొలీగ్స్ వెళ్లిపోయారు. విష్ణు మధుని అలా చూసి చాలా బాధ పడ్డడు. కొన్ని రోజులు తరువాత ఒక రోజు సాయంత్రం విష్ణు తన మనసు ఉన్నా ప్రేమని చెప్పాలని అనుకున్నాడు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు విష్ణుకి . మధు ఒక లెటర్ రాసి దేవ్ కి చెప్పాడు. మధుకి ఈ లెటర్ ఇవ్వు అని చెప్పాడు విష్ణు. దేవ్ వెళ్లి ఇచ్చే లోపే  మధు వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన మధుకి  వాళ్ల అమ్మ నీకు రేపు ఈవెనింగ్ పెళ్లి చూపులు నీకు అని చెప్పింది సుశీల.అవునా అమ్మ సరే నేను ఆఫీస్ నుంచి తొందర గా వస్తాను అమ్మ అని చెప్పింది మధు.. ఆఫ్టర్ నుంచి వర్షం కురుస్తుంది. ఆగడం లేదు.దేవ్ సర్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యరా అని అడిగింది  మధు. సరే మధు ఫైవ్ మినిట్స్ ఆగు వస్తాను అని చెప్పాడు దేవ్. సరే అని వెయిట్ చేస్తుంది దేవ్ కోసం.కానీ చాలా టైమ్ అయ్యింది కాని దేవ్ రాలేదు. వెళ్లి చూస్తే అక్కడ లేడు దేవ్. రామకృష్ణ కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగారు మధుని . నేను ఆఫీసులోనే ఉన్నాను నాన్న అని చెప్పింది మధు.సరే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వర్షం వల్ల పెళ్లి వాళ్లు రావడంలేదు అని చెప్పారు రామకృష్ణ. సరే నాన్న అని చెప్పి కాల్ కట్ చేసింది మధు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మధు మాత్రం వాళ్లకి దూరంగా  ఉండి ఆలోచిస్తుంది. విష్ణు వచ్చి ఏంటి మధు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు విష్ణు. ఏమీ లేదు సార్ అని చెప్పింది మధు. లేదు ఏదో ఉంది మధు చెప్పు అని అడిగాడు విష్ణు. అది సార్ నేను దేవ్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది మధు. విష్ణు ఆ మాట విని  చాలా షాక్ అయ్యాడు కన్నీళ్లు బయటికి వస్తున్న కూడా అప్పుకొని మరి ఈ విషయం గురించి దేవ్ కి చెప్పవా అని అడిగాడు విష్ణు.లేదు సార్ దేవ్ తో చెప్పలేదు అని చెప్పింది మధు. విష్ణు ఆఫీస్ లో రెండు రోజులు క్రితం ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆ విషయం గురించి మాట్లాడడానికి పోలీసులు వచ్చారు విష్ణుతో .ఈ విషయం తెలిసి విష్ణుని అడగడానికి వచ్చారు పోలీసులు. ఈ విషయం తెలిసి మధు దేవ్ కి తన ప్రేమ విషయం చెప్పలేదు అని చెప్పింది మధు విష్ణుతో. అవునా ఏం కాదు వెళ్లి చెప్పు ధైర్యంగా వెళ్లి చెప్పు నీ ప్రేమ విషయం అని ధైర్యం చెప్పాడు విష్ణు మధుకి.. దేవ్ దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ దేవ్ లేడు అని చెప్పింది మధు విష్ణుతో.అవునా మధు సరే రేపు మార్నింగ్ ఆఫీస్ కి తొందర రా నేను దేవ్ ని తీసుకొని వస్తాను అని చెప్పాడు విష్ణు మధుతో. ఒకే సార్ బై  అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది మధు. రేపు దేవ్ కి ఏదో ఒకటి చెప్పి ఆఫీస్ కి త్వరగా తీసుకెళ్లాలి అని అనుకుంటాడు విష్ణు. దేవ్ అప్పుడే వచ్చి  ఏమైంది ఏదో ఆలోచిస్తూ విష్ణు అడిగాడు దేవ్. ఏం లేదు దేవ్ రేపు మనం త్వరగా ఆఫీస్ కి రావాలి కదా అని చెప్పాడు విష్ణు. ఎందుకు విష్ణు రేపు త్వరగా రావాలి ఆఫీస్ కి అని అడుగుతాడు దేవ్ . రేపు మార్నింగ్ ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అందుకే వెళ్లాలి నువ్వు నాతో రావాలి దేవ్ అని చెప్పాడు విష్ణు. సరే విష్ణు నేను వస్తానులే అని చెప్పాడు దేవ్. పద ఇంటికి వెళ్ళాము అని కార్లో వెళ్లారు. దేవ్ ఇంకొక విషయం చెప్పాలి రెండు రోజుల క్రితం మన ఆఫీస్ లో ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది కదా అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి పోలీసులు వచ్చారు ఈరోజు అని చెప్పాడు విష్ణు. దేవ్ కొంచెం కంగారుగా అవునా ఎప్పుడు వచ్చారు ఈవినింగ్ దేవ్ నీకు తెలియదా అని అడిగాడు విష్ణు. లేదు విష్ణు కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళాను అని చెప్పాడు దేవ్. దేవ్ నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. అది ఎవరో కాదు నీకు బాగా తెలుసు అని చెప్పాడు విష్ణు. ఎవరు విష్ణు అమ్మాయి అని అడిగాడు దేవ్. ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది మధు కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది పెళ్లిచూపులు క్యాన్సిల్ అయినందుకు. రేపు ఎలాగైనా దేవుడికి నా మనసులో మాటని చెప్పేయాలి అనుక్కుంటుంది మధు.విష్ణు దేవ్ ఇంటికొచ్చి కొంచం కంగారుగా తన రూమ్ లోకి వెళ్ళి పోతాడు దేవ్ . విష్ణు తన రూమ్ లోకి వెళ్లి బాధపడతాడు  మధు ని ఎంతో గాఢంగా ప్రేమించాను. కానీ మధు మాత్రం దేవ్ ప్రేమిస్తుంది  రేపు దగ్గరుండి నేనే పెళ్లి చేయాలేమో అని బాధ పడతాడు విష్ణు. దేవ్ కంగారుగా ఆలోచిస్తాడు నన్ను ఆఫీస్ లో ప్రేమించే అమ్మాయి ఎవరు ..రెండు రోజుల క్రితం మిస్సైన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను ఈవినింగ్ పోలీసులు వచ్చారా?? నేను బతికి పోయాను నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తాడు దేవ్. దేవ్ రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. ఆమె పేరు శృతి నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది దేవ్ కి.దేవ్ కూడా శృతి ప్రేమని ఒప్పుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఈవినింగ్ పార్టీ కి రమ్మని చెప్పాడు శృతిని దేవ్. కొంచెం భయంతోనే పార్టీ కి వెళ్ళింది శృతి . అక్కడ శృతి కి డ్రగ్స్ ఇచ్చి ఫారెన్ వాళ్లకి అమ్మేశాడు దేవ్.

నెక్స్ట్ రోజు మార్నింగ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు శృతి పేరెంట్స్. శృతి కేస్ గురించి ఈ రోజు ఈవినింగ్ ఆఫీస్ కి వచ్చారు  అని అనుకున్నాడు దేవ్. రేపు మరొక అమ్మాయి . ఆ అమ్మాయిని కూడా  శృతిల ఫారెన్ వాళ్లకి అమ్మేస్తాను అని అనుకుంటాడు దేవ్.మధు ఎవరో కాదు సిబిఐ ఆఫీసర్. ఈ విషయం ఎవరికీ తెలియకుండా విష్ణు ఆఫీస్ లో జాయిన్ అయింది మధు. దేవ్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది అబద్ధం  మధు ఆడుతున్న నాటకం. ఈ విషయం తెలీక విష్ణు చాలా బాధపడుతున్నాడు పాపం అని అనుకుంది మధు. మార్నింగ్ లేచి తయారయింది ఆఫీస్ కి వెళుతుంది మధు. విష్ణు దేవ్  కూడా ఆఫీస్ కి వచ్చేస్తారు. ఫస్ట్ గా మధు ఆఫీస్ కు వచ్చింది ఆ తర్వాత విష్ణు దేవ్  వచ్చారు. ఏంటి విష్ణు ఆఫీస్ లో ఎవరు లేరు ఓన్లీ మధు తప్పించి అని అడిగాడు దేవ్. నిన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు మాధునే అని చెప్పాడు విష్ణు.అవునా విష్ణు అని అడిగాడు దేవ్. నిజామే దేవ్ అని చెప్పింది మధు.ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు మధు ప్రేమని. మధు కూడా చాలా సంతోషంగా ఉంది. విష్ణు బాధ తో బయటికి వెళ్ళిపోయాడు.రెండు రోజుల తర్వాత ఈవెనింగ్ పార్టీ కి రమ్మని చెప్పాడు దేవ్ మధుని.

మధు కొంచెం భయపడుతూ పార్టీ కి వెళ్ళింది. అక్కడ దేవ్ ని  చూసి కొంచెం హ్యాపీ గా ఫీల్ అయింది మధు.. తను వెనకలే మారువేషంలో వచ్చారు పోలీసులు .. ఈ విషయం దేవ్ కి  తెలియక ఆ ఫారెన్ వాళ్ల ని కూడా రమ్మడు.. మధు టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు పార్టీలో.. దేవ్ ఫస్ట్ జ్యూస్ తీసుకుని వస్తాడు మధు కోసం దేవ్.. ఫస్ట్ మధు నేను తాగాను  జ్యూస్ అని  చెప్పుంది.ఎందుకు మధు అని అడుగుతాడు దేవ్. సరే వేరైనా జ్యూస్ తీసుకురావాలా అని  అడుగుతాడు దేవ్. వద్దు దేవ్ అని చెప్పుంది మధు. ఒక జ్యూస్ లో డ్రగ్స్ కలిపి మధుకి ఇస్తాడు. కానీ అక్కడ గ్లాస్ మార్చేస్తుంది మధు. వేరే గ్లాసులో ఉన్న జ్యూస్ తాగుతుంది మధు. కావాలనే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది మధు.. ఈ విషయం తెలియని దేవ్ ఆ ఫారిన్ వాళ్లకి మధుని తీసుకొని వెళ్ళమంటాడు.. పోలీసులు మధు టీమ్స్ రెడీగా ఉండండి ఫారెన్  వాళ్ళని పట్టుకుంటారు. అప్పుడు తెలుస్తది మధు సిబిఐ ఆఫీసర్ అని.. తర్వాత ఫారెన్ లో ఉన్నా తెలుగు అమ్మాయిలని  తీసుకువస్తారు. శృతి ని వాళ్ళ పేరెంట్స్ అప్ప చెప్తారు.. కోర్ట్ దేవ్ వాళ్లకి ఉరి శిక్ష వేశారు..మరో రెండు రోజుల లో ఉరిశిక్ష అమలు చేస్తారు..విష్ణు వచ్చి మధుకి నా ప్రేమ విషయం చెపుతాడు.. కానీ మధు మాత్రం ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు విష్ణు అని చెప్పుంది మధు. సరే మధు నీ ఇష్టం నీ ప్రేమ కోసం ఎదురు చూస్తాను అని చెప్పాడు విష్ణు..రెండు రోజులు తరువాత విష్ణు ని చూసి షాక్ అవుతుంది మధు..నువ్వు ఏంటి మా ఇంట్లో అని అడిగింది మధు. అమ్మ విష్ణు ఎందుకు వచ్చారు అని అడిగింది. మీ నాన్నతో మాట్లాడాలి అంట అని చెప్పింది సుశీల. అప్పుడే వచ్చారు రామకృష్ణ . మధు తన గదిలోకి వెళ్ళిపోయింది. నమస్తే అంకుల్ నా పేరు విష్ణుపరీచి మీ అమ్మాయి కొన్ని రోజులు మా ఆఫీస్ లోనే పని చేసింది. నేను మధుని ఎంతో గాఢంగా ప్రేమించాను అంకుల్ . నా ప్రేమ విషయం మధుకి చెప్పాను కానీ ఇప్పడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పింది మధు.. మీరు ఆంటీ  ఒప్పుకుంటే మధుకి ఎప్పుడూ ఇష్టం ఉండే అప్పుడే మాకు పెళ్లి చెయ్యండి అని చెప్పాడు విష్ణు. సరే విష్ణు మాకు ఇష్టమే అని చెప్పారు రామకృష్ణ సుశీల..విష్ణు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు..మధు నీ  ప్రేమ కోసం ఎదురు చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.

You May Also Like

One thought on “నీ ప్రేమ కోసం

  1. చాలా చాలా చాలా బాగుంది మేడం…👌👌👌💐💐💐💐🍵🍵

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!