పల్లె వెలుగులు

పల్లె వెలుగులు

రచన : కందర్ప మూర్తి

పల్లె వెలుగులు

తెలతెల వారగ మంచుతెరలు వీడి

తూరుపు కొండల నడుమ తెల్లని కాంతి పుంజంతో

పరుగున వచ్చిన భానుడు లెగ లెగమంటాడు

పక్షులు కిలకిలారావాలతో స్వాగత మంటాయి

చెరువు నీటిలో పద్మం పకపకమంటుంది

కొక్కురో కో అంటూ తొలి కోడి ఘోష పెడుతుంది

లే లెండని పశువులు పలకరిస్తాయి

ప్రశాంతమైన పల్లెలో హడావుడి మొదలు

అరక ఎద్దుల మెడల మీద నాగలి ఇరుసు

చేతికర్రతోన అన్నదాతల అదిలింపులు

పసువుల పాలు పితక ఇంతుల పరుగులు

పాలకేంద్రం కాడ పాల ముంతల వరసలు

దడులు తీసినాక మేకల మందల అరుపులు

రాములోరి గుడిలోన అయ్యప్ప భక్తుల భజనలు

గబ గబ భానుడు పై పైకి ఎగబడుతుంటె

పల్లె జనాలు పనులతో ఉరుకులు పరుగులు

పొద్దెక్కగానె ఊరంతా ఎటుపోయెనో ఎరుక లేదు

సూరీడొచ్చె, సతమతమాయె పల్లె బతుకులు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!