అమ్మ మనసు

అమ్మ మనసు

రచయిత::సుజాత.కోకిల

 

నీ రూపం నాలో పెరుగుతుంటే చెప్పలేని
ఆనందం నాలో

నా కడుపులో నీవు తన్నుతుంటే నే చెప్పలేని
అనుభూతిని పొందాను.

కష్టం అని తెలిసిన అమ్మ అనే పిలుపుకై
నా ప్రాణాన్ని పణంగా  పెట్టాను.

నే నిను నవమాసాలు మోసి కన్నాను
నా అమ్మ మనసు పులకరించింది.

నీకు మాతృత్వపు ప్రేమను పంచాను
నీ తొలి స్పర్శ తో నా జన్మ ధన్యం

నీ అడుగులు తడబడుతుంటే నా చేయి
అందించి నిను ముందుకు నడిపించాను

నీవు ఎన్నో. ఉన్నత శిఖరాలు ఎక్కాలని
నా ఆశలలో  నా కోరికలలో

నిజమైన వారసుడిగా నిలిచి ఉండాలని
నా ఆయుష్షు నీకే నింపాలని

నిను నిత్యం చిరంజీవిగా చూస్తు నా జీవితం
నీ ముందు పుష్పించు పువ్వులా ఉండాలని

ఇంక నా జీవితం. బవబందాలను చాలించి స్వచ్చమైన మనసుతో

ఆ దేవుని పాదాలపై పువ్వులా వాలాలని దేవున్ని కోరుకుంటున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!