హారిక కళ్యాణం

హారిక కళ్యాణం

రచన: సూర్యదేవర స్వాతి

“హారిక హారికా ఒకసారి ఇలా రమ్మా..”

“వస్తున్నానమ్మా,….ఏంటి అమ్మ పిలిచావు?”

“నీతో కొంచెం మాట్లాడలి తల్లి, అందుకే పిలిచాము.కూర్చో…”

“చెప్పండి నాన్న, దేని గురించి మాట్లాడలి అనుకుంటున్నారు.”

“ఏమీ లేదమ్మా… నీ చదువు పూర్తి అయ్యింది కదా,ఉద్యోగం చేసే ఆలోచన ఏమన్నా ఉందేమో కనుక్కుందామని పిలిచాను.”

“అదేమీ లేదు నాన్నా,ఇప్పడే కదా  చదువు పూర్తి అయింది,కొన్ని రోజులు ఇంట్లో ఉందాం అనుకుంటున్నా, తర్వాత చూస్తాను.”

కాసేపు తటపాటాయించి….”అమ్ములు నీకు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం రా, నువ్వుఏమంటావ్……” అని అడిగారు.

పెళ్లి అనగానే ఏదో అర్ధంకాని స్థితిలో ఉన్న…కాసేపటికి కుదురుకొని “మీ ఇష్టం నాన్నా…”అని చెప్పింది.

సంతోషంగా…”అయితే సంబంధాలు చూడమంటావ…..నా స్నేహితులులతో చెప్తాను.”

“మీ ఇష్టం నాన్న…”

“నా బంగారుతల్లి…” అని ప్రేమగా కూతురి తల నిమిరాడు.

“ఆగండాగండి..ముందు మీ యువరాణి గారికి ఎలాంటి వాడు కావాలో అడగండి, ఆ తర్వాత వేట మొదలుపెట్టండి”

” అవును నిజమే…చెప్పు తల్లి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి.”

“నాకు ఏది మంచో మీకు బాగా తెలుసు గా అమ్మ …ఇంకా నేను చెప్పేది ఏముంది.”

“అలా కాదు హారిక ….ప్రతి ఆడపిల్ల కి పెళ్ళి అంటె కొన్ని ఆశలు, కలలు ఉంటాయి కదా…,ఏ విషయంలో నైనా సర్దుకుపోవచ్చు గాని మనం జీవితం పంచుకొనే మనిషి విషయంలో కాదమ్మ….ఇది మన మనసుకు సంబంధించింది.”
.
“అవును హారిక…ఇప్పుడు చెప్పు ఎలాంటి వాడు కావాలో..”

“నాన్న అబ్బాయి చదువు ఉద్యోగం కన్నా గుణం ముఖ్యం కదా ….పెళ్లి చేసుకునే అతను తన వాళ్ళ నే కాదు, నన్ను మాత్రమే కాదు నా తల్లిదండ్రులు లను కూడా తన వాళ్ళ గా చూడాలి.అవసరమైనప్పుడు మీకు ఒక కొడుకుగా ముందు నిలబడాలి.అలాంటివాడైతే నా భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నాన్న.”

“సరే రా….ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్లి పడుకో.”

“ఒకే గుడ్నైట్ నాన్న, అమ్మ..”

రఘు,పద్మ: గుడ్ నైట్..

వెళ్తున్న కూతురిని చూస్తూ…”ఏమండీ అప్పుడే మన అమ్మాయి పెళ్లీడుకొచ్చిందంటే నమ్మలేకపొతున్నాను అండి…”

“ఆడపిల్లలు పద్మా ….త్వరగా ఎదిగిపోతారు”

**

తరువాత రోజు ….హారిక తన స్నేహితురాలిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది…

కాలింగ్ బెల్ మొగడంతో….

“కావ్య….ఎవరో వచ్చారు. డోర్ తీయి….

డోర్ ఓపెన్ చేసిన కావ్య,  హరికను చూడడం తోనే సంతోషంగా హగ్ చేసుకొని “ఎన్నాళ్ళయింది ఏ నిన్ను చూసి రా లోపలికి….” ఏంటి సగంతులు…ఎలావున్నావ్..ఏమిచేస్తున్నావు….ఆంటీ, అంకల్ ఎలా ఉన్నారు…ఇంకా….

“అబ్బబ్బా ఆపవే …ఎంటా ప్రశ్నలు…. కాస్త గాప్ ఇవ్వవే తల్లి…”

“ఎంటే నువ్వు…. నిన్నుచూసిన ఆనందంలో ఏదో ఫ్లో లో …. అలా అంటుంటే….పో…”

మూతి ముడిచిన స్నేహితురాలిని చూసి…”అబ్బా ఆ మూతి మార్చవే చూడలేక చేస్తున్నాను.ఇంతకీ అంటీ ఎక్కడ…”

” ఇక్కడ….మీరు ఇద్దరు అసలు పక్కన వాళ్ళని పట్టించుకునేల ఉన్నారా!?”

చిన్నగా నవ్వి “సారి అంటీ …ఎక్కడ ఇది నన్ను అసలు మాట్లాడనిస్తేనా…”

” సరదాగా అన్నాను రా… ఎలవున్నావ్…”

” బాగున్నాను అంటీ…. మీరు ,అంకుల్ ఎలా ఉన్నారు… ఇంతకీ అంకుల్ ఎక్కడ కనిపించట్లేదు.

” బాగుణ్ణం రా. అంకల్ ఆఫీసు కి వెళ్లారు.”

” హేలో నేను ఒక దాన్ని ఇక్కడ వున్నాను కనిపిస్తున్ననా అసలు”

సీత కావ్య తలపై ఒక్కటేసి “ఆపవే …..నీ వాగుడు.”

తల రుద్దుకుంటూ “పో అమ్మ …..”

“నేనెక్కడికి పోతానే పెళ్ళి చేస్తే నువ్వే పోతావ్ అత్తారింటికి.ఉండండి నేను వెళ్లి కాఫి తీసుకొస్తా…” అని వంటగదిలోకి వెళ్లిపోయారు.

వెళ్తున్న తల్లిని చూసి…. “అబ్బా నీకు ఎప్పుడు  నా పెళ్లి గోలే” అని విసుక్కుంది కావ్య. కావయ మాటలకి నవ్వుతున్న హారిక ని చూసి…” ఎందుకే ఆ నవ్వు….”అని కళ్ళు ఉరిమింది.

“ఎం లేదులేవే….ఊరికే నవ్వాను.”

“సరే… చెప్పు ఇంకేంటీ విశేషాలు.” అంటూ..సోఫాలో కూర్చున్నారు.

” ఎమున్నాయే …కాళీ..”

” ఇదిగోండి కాఫి తీసుకోండి…..మీరు మాట్లాడుతూ ఉండండి…నాకు వంట పని ఉంది నేను వెళ్తున్నాను.”

“సరే అమ్మ మేము నా రూమ్ లో ఉంటాం ఏమన్నా అవసరమైతే పిలువు.అని హారిక వైపు చూసి రా హరి వెళ్దాం” అని తన గదిలోకి హరికని లాక్కుపోయింది.

కావ్య రూంలో ……

“ఏంటి హరి వచ్చినప్పటి నుండి చూస్తున్నా… చాలా సైలెంట్ గా ఉన్నావ్ …ఏమెయిన్దే…..”

“ఎం లేదు… ఇంట్లో  పెళ్ళి టాపిక్ తీసుకోచ్చారు.దాని గురించే కొంచం కంగారుగా వుందే.”

“కంగారెందుకే ….ఏ  నీకు ఇష్టం లేదా…”

“అదేం లేదు …కానీ …ఇన్ని రోజులు అమ్మా నాన్న దగ్గర ఉండి ….సడన్ గా పెళ్లి అంటే…”

” నిజమేనే….  కానీ, అడపిల్లలుగా మనకు తప్పదు గా….”

“హుమ్…అదే ఆలోచిస్తున్నానే….ఆ వచ్చే వాడు ..ఏలాంటి వాడో..,ఫ్యామిలి ఎలా ఉంటుందో….నేను వాళ్ళతో సర్దుకుపోగలనా…నిన్నటి నుండి ఇవే ఆలోచనలు.అన్నింటి కంటే , నీకు తెలుసుగా అమ్మానాన్నలకి నేను ఒక్కదాన్నే. నన్ను చేసుకొనే అతను మా అమ్మానాన్నలని కూడా బాగా చూసుకోవాలనే ఆశ ఉంటుంది గా కావ్య……”

” హుమ్… అదీ..కరెక్ట్ లే…అవును మనలో మన మాట..ఇంతకీ నీకు ఎలాంటి వాడు కావాలో నచెప్పు..చెప్పు…” అని  ఉత్సాహంగా అడుగుతున్న స్నేహితురాలిని చూసి నవ్వి, “ఆస్తుల, అంతస్తులు ఎలావున్నా…కష్టం తెలిసినవాడు ఐ ఉండాలి.కుటుంబం మీద బాధ్యత కలిగిన మనిషి అవ్వాలి.నేను భాధ పడ్డప్పుడు తను కన్నీరు కార్చనవసరం లేదు, కాస్త ఓదార్పు ఇస్తే చాలు.లాంగ్ డ్రైవ్ లు,షాపింగ్ లు ఇవేమీ అవసరం లేదు, ఇంటి దగ్గర ఉన్న కాసేపు నాతో టైం స్పెండ్ చేస్తే చాలు” కావ్య రెండు చెంపల క్రింద చేతులు పెట్టుకొని అలానే చూస్తుంది హరి వైపు

” ఇంకా… ” అని చెప్పబోతు… “కావ్య వైపు చూసి ఏంటే అలా చూస్తున్నావ్….. నాకు దిష్టి తగులుతుంది.”

” ఓరిని వేషాలో….అహేయ్ అది కాదే నువ్వు అచ్చం మా విష్ణు అన్నయ్య లాగే మాట్లాడుతున్నావ్ ….అందుకు చూస్తున్నా…”

“విష్ణు నా ఎవరే,అయినా నీకు అన్నయ్య లు ఎవరు లేరుగా..!?”

“అన్నయ్య అంటే… పెదనాన్న వాళ్ళ అబ్బాయి. మొన్నామధ్య అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు… పెళ్లి టాపిక్ వస్తే , అన్నయ్య కూడా అచ్చం ఇలానే అన్నాడు.అదే గుర్తొచ్చింది నువ్వు మాట్లాడుతుంటే…”

“ఒహ్హ్ ఒకే ఒకే…”

” అవునే ఎవరినో ఎందుకు మా అన్నయ్య నీ చెసేసుకోవే. ..ఎంచక్కా నాకు వదినవి అవ్వొచ్చు…నీకు తెలుసా నువ్వు చెప్పిన లక్షణాలు అన్ని అన్నయ్య దగ్గర ఉన్నాయి.నువ్వు “ఊ” అను…నేను అన్నయ్య తో ..పెద్దమ్మ తో మాట్లాడతా…ఒకే న..’

” హే నోరు ముయ్యవే….నువ్వు నీ మాటలు..,అవునూ పెద్దమ్మ తో మాట్లాడతా అంటున్నావు…మీ పెద్దనన్నా లేరా..”

” లేరు హరి ..,అన్నయ్య బి.టేక్ 3rd ఇయర్ లో వున్నప్పుడు పెద్దనాన్నకి ఆక్సిడెంట్ అయింది.బ్రతికించుకోవలని అన్నయ్య చాలా ప్రయతించాడు.చాలా ఖర్చు కూడా అయింది పాపం..కానీ, దేవుడు దయచూయించ లేదు…పెద్దనాన్న పోయాక ఇంటి బాధ్యత అంత అన్నయ్య పైన పడింది.అప్పటి దాకా పెద్దనాన్న చూసుకోవడం వల్ల ఎం తెలియలేదు కానీ,తర్వాత హాస్పిటల్ ఖర్చులు,అన్నయ్య, అక్క చదువులు, పెద్దమ్మ అనారోగ్యం.. అన్ని ఒకేసారి మీద పడ్డాయి.పాపం అన్నయ్య చాలా కష్టపడ్డాడు.పేద్దనాన్న ..p.f మనీ తో కొంత వరకు ఆర్ధికంగా పరవాలేదు కానీ , పెద్దమ్మ అనారోగ్యం వల్ల చాలా ఆందోళన పడ్డాడు.ఒకవైపు…పెద్దమ్మ ని చూసుకుంటూనే….విద్య అక్క చదువు..,తన చదువుని బ్యాలన్స్ చేస్తూ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్ వాడు.అలా కష్టపడి చదుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ లో మంచి జాబ్  కూడా తెచ్చుకున్నాడు.తర్వాత విద్య అక్క చదువు పూర్తి అయ్యాక ..అక్క కి పెళ్ళి కూడా చేసాడు.ఈ కాలం లో అలాంటి వాళ్ళు ఎక్కడ వుంటారు చెప్పు…నాన్న కూడా అన్నయ్య ని చూసి ఎంత గర్వపడతారో తెలుసా….అన్నయ్య కి కూడా చాలా సంబంధాలు వస్తున్నాయ్..కానీ వచ్చేవాళ్ళు పెద్దమ్మ ని బాగా చేసుకుంటారో లేదో అని అన్నయ్య భయం…
అందుకే నిన్ను చేసుకోమంటున్నాను…..” అన్న తన మాట పూర్తి కాకుండానే బయట నుండి సీత గారు

“కావ్య…కావ్య..ఎవరొచ్చారో చూడు “” అంటూ పిలవడం తో ఇద్దరు బయటకు వచ్చారు…వచ్చినవాళ్ళని చూడగానే “పెద్దమ్మ… అన్నయ్య…అంటూ వెళ్లి వాళ్లను చుట్టేసింది..కావ్య.

“ఎలావున్నావ్ రా కావ్య…”

“సూపర్ పెద్దమ్మ…మీరు ఎలా ఉన్నారు…అక్క ఎలా ఉంది…”

” అక్క బాగుంది అమ్మ…ఇప్పుడు అక్కడనుండె వస్తున్నాం…మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది కదా అని అన్నయ్యా,నేను ఇటు వచ్చాం.”

“అవును అక్క…విద్య డెలివరీ అయ్యాక మళ్ళీ మనము కలవనేలేదు.వచ్చి మంచి పనే చేశారు.”

“హుమ్..ఇప్పడు విద్యని అత్తవారింటికి పంపించి వస్తున్నాం సీత….” అంటూ…దూరంగా నిలబడ్డ హారిక ని చూసి “అవును ఈ అమ్మాయి ఎవరు సీత ఎప్పుడు మీ చుట్టాలలో కూడా చూసిన గుర్తులేదు….”

” తను నా ఫ్రెండ్ హారిక! పెద్దమ్మ. తను నేను కలిసే చదువుకున్నాం.అని హారిక వైపు తిరిగి “హారిక నేను చెప్పా కదా మా పెద్దమ్మ..విష్ణు అన్నయ్య అని వీళ్లే..”

చిన్నగా నవ్వి “నమస్కరమండి….” అనగానే  చిన్నగా నవ్వి వూరుకుంది లక్ష్మీ.

“అన్నయ్య తను నా ఫ్రెండ్ హారిక.”

” హయ్ అండి…”

“హేలో అండి…”

అందరూ కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాక …హారిక వెళ్ళిపోతుంది.తర్వాత లక్ష్మీ, “సీత.. ఆ అమ్మాయి చాలా బాగుంది వాళ్ళ కుటుంబ వివరాలు మీకేమైనా తెలుసా….మన విష్ణు కి మంచి జోడీల ఉంది.”

” ఆవును అక్క ..ఆ అమ్మాయి అందం లోనే కాదు ,గుణం లో కూడా మన విష్ణు కి సరిపోతుంది.చాలా నెమ్మదస్తురాలు…కలుపుగోలు అమ్మాయి కూడా అక్క..”

ఇక్కడ వీళ్లిద్దరూ ఇలా మాట్లాడుకుంటుండగానే,..టెర్రస్ పైన విష్ణు ని కావ్య కూడ ఇదే విషయం అడుగుతుంది….

” అన్నయ్య హారిక పైన ని అభిప్రాయం ఏంటి….”

” నిజం చేప్పునా …చూడగానే చాలా నచ్చేసిందిరా….నాకు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో
అలానే ఉంది.”

” అవును అన్నయ్య …హరి కూడా అచ్చు నీలానే ఆలోచిస్తుంది.రిలేషన్స్ కి వాల్యూ ఇస్తుంది.చాలా మంచి అమ్మాయి అన్నయ్య…నీకో విషయం తెలుసా…తనకి సంబంధాలు చూస్తున్నారంటా…మీరు వచ్చేముందు మేము ఆ విషయం ఏ మాట్లాడుకుంటున్నాం.నీకు నచ్చితే చెప్పు అన్నయ్య, నాన్న కి చెబుదాం.నాన్నా, వాళ్ల నాన్న మంచి ఫ్రెండ్స్ కూడా….ప్రాబ్లెమ్ కూడా లేదు ఏమంటావు”

“అవునా..  అయిన నాకు నచ్చితే సరిపోతుందా.. అమ్మకి నచ్చాలిగా..,ఆ అమ్మాయి కి కూడా నచ్చాలి..” అని నవ్వుతూ చూసాడు విష్ణు.

” పెద్దమ్మ తో నేను మాట్లాడతా అన్నయ్య..అయిన నిన్ను కాదునుకొనే వాళ్ళు ఏవరుంటారు అన్నయ్య..నువ్వు బంగారనివి రా.”

” కావ్య తలపై ఒకటి వేసి బాగా ముదిరిపోయావే,పెద్ద నాపసాని లా మాట్లాడుతున్నావు .పద కిందకు వెళ్దాం…”

” అన్నయ్య నువ్వు, నాకు ఆన్సర్ చెప్పలేదు…పెద్దమ్మ తో నేను మాట్లాడతా అన్నాగా…”

“ఏమి అవసరం లేదు మేము అంతా విన్నాం…”అంటూ.లక్ష్మీ., సీత, రాఘవ గార్లు వీళ్ల దగ్గరకు వచ్చారు…

“చెప్పు విష్ణు నీకు హారిక నచ్చిందా..”

” నాకేం అభ్యన్తరం లేదు బాబాయ్ …కానీ వాళ్ళకి మనం నచ్చాలిగా…”

“ఆ విషయం నాకు వదిలేయరా…నీకు ఓకె కదా…”

“అదీ… బాబాయ్…”

” అన్నయ్య సిగ్గే చెప్తుంది నాన్నా ఒకే అని…”

10 రోజుల తర్వాత….

” హారిక రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు..ఉదయాన్నే రెడీ అవ్వమ్మ.”

హారిక కంగారుగా “అప్పుడేనా అమ్మా…”

” ఎమ్మా …నీకు ఇష్టం లేదా…”

” అదేం లేదమ్మా ఎందుకో చిన్న కంగారు అంతే….”

” సరేయ్ త్వరగా తినేసి పడుకో ..మళ్ళీ ఉదయాన్నే లేగాలిగా….”

“అలాగే అమ్మా… ” అని తినేసి రూమ్ కి వెళ్లిన హారిక..ఆలోచిస్తూ..ఉండిపోయింది.

.మరుసటిరోజు…..

హారిక రెడి అయ్యి రూంలో ఉంది.ఇంతలో బయట హడావిడి మొదలయింది.హరికకు అర్ధమైంది పెళ్లి వాళ్ళు వచ్చారని,కంగారు ఇంకాస్త పెరిగింది.ఇంతలో హరికను వాళ్ళ అమ్మ గారు వచ్చి తీసుకెళ్లి, వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టారు.దించిన తల ఎత్తకుండా అలానే కూర్చున్న హరికను చూసి “వదిన గారు కాస్త మా అన్నయ్యా ని చూడండి అండి”  అన్న గొంతు విని వెంటనే తల ఎత్తిన హారిక కు ,కావ్యా , విష్ణు ఫ్యామిలీ కనిపించారు.ఆశ్చర్యంగా చూసింది హారిక వాళ్ళ నాన్న వైపు.

“బాబు అమ్మాయి తో ఎమన్నా మాట్లాడలంటే మాట్లాడండి..”

బాల్కనీ లో..

“హారిక గారు నేను మీకు నచ్చానా…”

“ఆ రోజు మీ గురించి కావ్య చెప్పాక మిమ్మల్ని చూసాక మీరంటే ఒక పోసిటివ్ ఒపీనియన్ వచ్చింది అండి.నాకు ఇష్టమే మరి మీకు!?”

రెండు నెలలు తర్వాత….

పచ్చని పందిట్లో…, పంచభూతల సాక్షిగా….,బంధుమిత్రుల అభినందనల తో….తన మనసును సూత్రం గా మార్చి, జీవితపు చివరి మజిలీ వరకు తనకు తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తూ.. విష్ణు, హారిక మెడలో మూడుముళ్ళు వేసాడు.

                       సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!