ఒంటరి గాధ

ఒంటరి గాధ

రచన: బి. శివకుమార్

అందరిలాగానే అమ్మానాన్నలకి జన్మిoపబడ్డ ఓ కుమారిడి ఒంటరి గాధ ఇది .
పిల్లవాడు పెరిగి పెద్దవుతున్న రోజులవి ,చిన్నపుడు అమ్మానాన్నల దగ్గర కంటే తాత అమ్మమ్మల పెంపకంలో పెరిగాడు .అమ్మానాన్నల ప్రేమ అంతగా స్వీకరించుకోలేదు .అమ్మమ్మ దగ్గరే ఉంటున్న కానీ వారు కూడా ఆ అబ్బాయి ని అర్థం చేసుకున్నా రోజులు చాలా తక్కువ . వీధి పిల్లలతో కాలక్షేపం చేస్తూ పాఠశాలకీ వెళ్ళేవాడు . 13 సం ,రాల తర్వాత అమ్మ నాన్నలను చేరాడు .బాలుడు తన ఇంటికి వెళ్ళాక తాతయ్య మరణం రెండు సం ,రాల తర్వాత అమ్మమ్మ కూడా ఆనారోగ్యంతో మరణించారు .తన సొంత గ్రామంలోనే 10 వ తరగతి పూర్తి చేసిన ఆ అబ్బాయి తన తండ్రి ప్రేమను పొందలేదు .తన తండ్రి వాడితో ప్రేమ ఆప్యాయం గా మాట్లాడినా రోజులు చాలా తక్కువ అమ్మ ప్రేమ అవని వంటిది కాబట్టి ఉంటుంది .
తండ్రి చేసే చేష్టలకి యేలాగైనా తన తండ్రిని మార్చుకోవలనే రోజు ఆలోచించేవాడు .తల్లి ని పిల్లవాడిని మానసికంగా హింసిస్తూనే వుండేవాడు తండ్రి .నలుగురిలో చెప్పుకోలేక పాపం తల్లి కొడుకులు తమలో తాము కుమిలిపోతువుండేవాళ్లు . ఇంటర్ చదువులకీ పెద్దనాన్న వాలదగ్గరకి వెళ్ళాడు ఇంటర్ పూర్తి చేస్తూ ఉన్న రోజులో అమ్మ ఎలా వుందో నాన్న ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో అనే ఆలోచన వుండేది .
అప్పుడప్పుడూ అమ్మతో ఫోన్లో మాట్లాడినా వాళ్ళ అమ్మ బాధ మాట్లాడేది . విషయం గమనించిన అబ్బాయ్ ఇక్కడ ఇంటర్ పూర్తి కాగానే యేలాగైనా మళ్ళీ అమ్మానాన్నల దగ్గర వుంటూనే చదువుకోవాలని నిర్నయిoచుకున్నాడు.
ఒకరోజు బయటకి వెళ్ళిన తన తండ్రి ఇంటికి తిరిగి రాలేదు .అన్నీ విదాలుగా వెతికి ప్రయత్నించిన తండ్రి జాడ తెలియక కుమారుడు తల్లి వేరే ప్రాంతాకినికి వెళ్తారు .
తిరిగి రాని తండ్రి ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్లపై ఊర్లో ప్రజలు నిదనలు అనుమనులుగా చేయడం ప్రారంబించారు . కధలు అన్నీ అల్లెశారు . ఏమి తెలియని తల్లి కొడుకులపై పోలీసు కేస్ పెట్టారు . విచారణలో ఏమి గ్రహించని పోలీసు వాళ్ళు వాళ్ళని ఆ కేస్ ను పట్టించుకోలేదు . కుమారుడి మేనత్త పెదనాన్న ఈ రదాంతం చేశారు .
ఆస్తి ఇవ్వనంటూ బ్రతకనివ్వక చవానివ్వక వాళ్ళని మానసికంగా హింసిస్తున్నారు . తన తండ్రి వున్నపుడు అందరూ తన ఇంట్లో ఉంటూ తింటూ హాయిగా వున్నవాళ్లు ,చెప్పకుండా ఎక్కడికి వెళ్లడో ఎవరు ఏం చేశారో కానీ ఇప్పుడు మమల్ని హింసిస్తూ మాతో మాట్లాడకుండా దైర్యం ఇవ్వక తోడు వుండక దూరం చేస్తున్నారు అని కుమారుడు ఒంటరిగా శోక సంద్రంలో మునిగిపోతున్నాడు . ఉన్నపుడు ఒకలా లేన్నపుడు ఒకలా ఊసరవెల్లిలా రంగులు మార్చే ఇ బందువుల మద్య నలిగిపోయిన ఓ కుమారుడి స్వీయ కథ .
వాళ్ళ బ్రతుకులకి ఎవరు వెలుగు చూపాలో..??

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!