పన్నీటి జలకాలు

పన్నీటి జలకాలు

రచన: మక్కువ. అరుణకుమారి

నవరసాలలో నాణ్యమైనది
నలుగురిని నవ్వించేది

నవ్వడం ఒక యోగం
నవ్వించడం ఒకభోగం
నవ్వలేకపోవడం ఓ రోగం

నాయకత్వ కళలో భాగం చేసేది
నలుగురిలో నగుబాటు కాకుండా చూసేది

ప్రజలతో మమేకం చేసేది
ప్రతిమదిని పులకరింపపజేసేది

ఉరిమే ఉద్రిక్తతల నుండి ఉపశమింపజేసేది
కలిగే ఒత్తిడులను చిత్తడి చేసేది
వినోదం కలిగించేది విచారం మరిపించేది

సెటైర్ చిత్రాల చరుపులతో చక్కిలిగింతలు పెట్టేది
వ్యంగ్య పదాల విరుపులతో వినోదం పంచేది

చురకత్తుల చురకలతో చిరునవ్వులు పూయించేది
చతురోక్తుల విసురులతో చిత్తరువులు చేసేది

హాస్యపూరిత గ్రంథాలు జన మనోరంజకాలు
హాస్యభరిత చిత్రాలు సేదదీర్చే పన్నీటి జలకాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!