స్త్రీమూర్తి

(అంశం :: “విమర్శించుట తగునా”)

స్త్రీమూర్తి 

రచన::శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

ధరణిపై పుట్టిన స్త్రీ మూర్తి
అందరి పుట్టుకకు ఆధారమయ్యెను ఆడదై
ఆకలినెరిగి అన్నం పెట్టెను అమ్మై
ఆలనా పాలనా చూసెను నాన్నై
ఇంట ఇంటెడు చాకిరీ చేసెను ఇల్లాలై
బయట ఉద్యోగమూ చేసెను మగవాడై
మగనికి సేవ చేసిను ఆలియై
కష్టంలో సహాయ సహకారాలందించెను స్నేహితురాలై
ఇబ్బందులలో సలహాలిచ్చెను మంత్రియై
అత్త,మామలను ఆదరించెను కోడలై
అమ్మ,నాన్నలను అభిమానించెను కూతురై
అన్న దమ్ములకు ఆప్యాయతను పంచెను సోదరియై
బిడ్డలకు బుద్దులు, సుద్దులు నేర్పెను గురువై
అన్నింటా తానున్న అతివని ,
మార్గదర్శకురాలైన మగువను
కష్టాలను తనలోనే దాచుకుని
కన్నీటిని దిగమింగుతూ
ముఖమునకు మాత్రం నవ్వు నులుముకుని
తన వారి సంతోషం కోసం
ప్రాకులాడే మహిళను
దీపంలా ఇంటికి వెలిగిస్తున్న గృహలక్ష్మి ని
ఏ పనైనా ఆలోచనతో చేస్తూ ,
ఏ రంగమునైనా అవలీలగా నెగ్గుకొస్తున్న ఇంతిని
అంథరి కోసం ఆలోచిస్తూ,
తిన్నదీ, లేనిదీ కూడా మరచి
లేచినది మొదలు పడుకునే వరకు
యంత్రంలా తిరుగుతూ,
ఒక మరమనిషిలా పని చేస్తున్న మగువను
ఆడదే కదా అని అవమానించుట సమంజసమేనా
అంతటి శక్తి సామర్ధ్యాలు గల సబలను
అబల అంటూ విమర్శించుట తగునా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!