(అంశం :: “విమర్శించుట తగునా”)
గాయమైన మనసు
రచన::సుజాత
అమ్మను బాధ పెట్టినప్పుడు ఆనందంగానే ఉంటుంది మనం ఏదో గెలిచామని
అమ్మను విమర్శించడం తగునా అని మనం విమర్శించుకోవాలి అప్పుడు తెలియదు అమ్మను బాధ పెడుతున్నామని
నా అన్న మనిషి దగ్గర లేనప్పుడు . అందరు మనల్ని దూరం పెట్టినప్పుడు.
ఓదార్చే వాళ్ళు లేక అమ్మ జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి .అప్పుడు తెలుస్తుంది
అమ్మ అంటే ఏంటో అందుకే అంటారు పెద్దలు నవ్వుతూ ఏడిపిస్తే ఏడ్చుకుంటూ అనుభవించాలని
నువ్వు పిలిచినా అందనంత దూరంలో ఉంది అమ్మ ఇప్పుడు నువ్వు ఏడ్చిన కన్నీళ్లు తుడవడానికి ఎవరు ఉండరు.
నాకు విమర్శించడం తగునా అని అప్పుడే ఆలోచిస్తే ఈ బాధ నీకు ఉండేది కాదేమో
.
పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకో ఇప్పుడైనా మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకో అమ్మ రుణం తీర్చుకో