కుటుంబ విలువలు
రచన :వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు
జగమంత కుటుంబం నాది,
జగడాలే తప్ప కలిసినది లేదు,
ఎవరికి ఎవరితో సంభంధం లేదు.
సుఖంలో అందరూ నీ తోనే ఉంటారు,
దుఃఖం లో ముఖం చాటేస్తారు,
ప్రపంచములో నీవే అన్ని అని పొగుడుతారూ
నీకే మంట పెట్టి దహిస్తారు,
దేముడినే మోసం చేస్తుంటారు,
మనుషులను ఎందుకు వదిలేస్తారు,
స్వార్థపూరిత మానవ జన్మ పునరుద్ధరించబడాలి,
“కుటుంబ విలువలకు ప్రాధాన్యత పెంపొందించాలి.”