పిడుగుపాటు

(అంశం:” ప్రమాదం”)

పిడుగుపాటు

రచన:: కవితదాస్యం

ఏటా పిడుగుపాటు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడం విషాదకరం…
ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి పిడుగులు పడే ప్రదేశాన్ని ముందుగా తెలుసుకుని..
అలర్ట్ చేయకపోవడనికి సర్కారు నిర్లక్ష్యం కారణం.. పిడుగుపాటుతో రైతులు, వ్యవసాయకూలీలు కాక పశువులు..
వందల సంఖ్యలో మృతి చెందుతున్నా…
పిడుగుపాటుకు ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా..
ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టే దిశలో..
అమెరికాలోని నెట్వర్క్ ఇస్రో సహకారంతో..
ముందుగా గుర్తించేందుకు అత్యాధునిక సెన్సార్లను వినియోగిస్తున్న..
ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తున్నా..
గంట ముందే పిడుగుపడే ప్రాంతాలను గుర్తిస్తున్న..
ప్రమాదాలను తప్పించలేక పోతున్నా సందర్భాలు కోకొల్లలు..
వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ఇస్రో సహకారంతో..
పర్యవేక్షించి క్లౌడ్ టు బ్రౌన్, క్లౌడ్ టు క్లౌడ్ అనే రెండు పద్ధతుల్లో..
సెన్సార్లు వర్క్ చేస్తున్నా తప్పించుకోలేని ప్రమాద ఘంటికలు..
పిడుగులు సెల్, ఫోన్ టవర్లు చెట్లపై పడే..
అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నా..
అవగాహన లేక..
ఆస్తులు, ప్రాణాలకు నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువ..
ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు టీవీ రిఫ్రిజిరేటర్ ల వినియోగం నిలిపివేయాలని..
సైన్స్ పరిశోధకులు వెల్లడించిన..
పట్టించుకోని ప్రజల నిర్లక్ష్య వైఖరి..
పిడుగుపాటు ఎలక్ట్రానిక్ పరికరాలను నీళ్ళను..
ఎక్కువగా ఆకర్షించడం వల్ల..
ప్రమాదం పొంచి ఉండి..
చెరువులు, చెట్లు ఉన్న ప్రాంతాల్లో..
నిలబడి వారి ప్రాణాలను చేజేతులారా కోల్పోతున్న వైనం..
ఖనిజ ప్రాంతాల్లో పిడుగుపాటు ఎక్కువే..
రైతుబంధు, రైతు బీమా పథకాలు..
వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిన..
పిడుగుపాటు మరణాలను, ప్రమాదాలను తగ్గించలేక..
తగు చర్యలు చేపట్టలేక నీరుగారి పోయిన దైన్యం..
టెక్నాలజీ తో ప్రమాదాలను తగ్గించవచ్చని ..
సెన్సారింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టి..
పిడుగు పాటు మరణాలను భారీ ఆస్తి నష్టాలను నివారించే దిశగా కదులుతోంది ప్రభుత్వం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!