రోడ్డు ప్రమాదాలు

(అంశం:” ప్రమాదం”)

రోడ్డు ప్రమాదాలు

రచన:: సంజన కృతజ్ఞ

ప్రమాదాలకు పుట్టిల్లు అతివేగం
నిదానంగా వెళితే వచ్చేది లేదు ఏ రోగం
జాగ్రత్త అందరికీ అవసరం

అతివేగం ప్రమాదకరం..
అని తెలిపినా వినిపించుకోరు ఈ జనం..

బైకులు కార్లు ఎక్కి నడుపుతారు…
తామే హీరోల మని అనుకుంటారు..

కొత్త బండి కొనే వరకు మంకుపట్టు…
అదే అవుతుంది ప్రాణాపాయానికి తొలిమెట్టు…

రోడ్లపైన కొడతారు ఫీట్లు…
తెలియక పడతారు నానా పాట్లు…

తాగుతూ ప్రయాణం ఒకరిది
తూగుతూ ప్రయాణం మరొకరిది
పరధ్యానంలో ప్రయాణం వేరొకరిది

నిర్లక్ష్యంతో ప్రయాణము
నీ ..జీవితానికే ప్రమాదము

అతి వేగం తో ప్రయాణం వద్దు
ప్రమాదం కొని తెచ్చుకో వద్దు
ప్రమెదాన్ని దూరం చేసుకో వద్దు

నిర్ధాక్షణ్యంగా నడపొద్దు..
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి కావోద్దు…
**********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!