ఏ మాయ చేస్తున్నావే

ఏ మాయ చేస్తున్నావే

రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )

నీ కనులలో ఏ మాయ ఉందే
నా మనసులోని భావాల్ని చదివేస్తుంది

నీ ఆలోచనలలో ఏ మాయ ఉందే
నా భవిష్యత్ పనుల ఫలితాలను చెప్పేస్తుంది

నీ ఒడిలో ఏ మాయ ఉందే
నా బాధల్ని మటుమాయం చేసేస్తుంది

నీ మోము లో ఏ మాయ ఉందే
నా పెదాలపై చిరునవ్వు పూయిస్తుంది

నీ చేతులలో ఏ మాయ ఉందే
నాకు ఆకలి లేకుండా చేస్తుంది

నీ స్నేహంలో ఏ మాయ ఉందే
నా అల్లరి రెట్టింపు అవుతుంది

నీ ప్రేమలో ఏ మాయ ఉందే
నా హృదయం నిండా నిన్నే నింపేసింది

You May Also Like

2 thoughts on “ఏ మాయ చేస్తున్నావే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!