నా కిరాణ కొట్టు

నా కిరాణ కొట్టు

రచయిత :: లోడె రాములు

ఆ కొట్టు కే ఎందుకెలుతున్నాను..?
దగ్గర్లో చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయిగా ..!
చిల్లర కొట్టువాడు…
వెళ్ళగానే…చిరునవ్వుతో..
పలకరించే తీరు…
లోకాభి రామాయణం….
క్షేమ సమాచారాలు..
నిజాయితీగా..
సరకుల కొలతలు.. ధరలూ..
ఆశగా ఎక్కువ డబ్బులు తీసుకోకపోవడం..
తన వద్ద కొన్నా,..
కొనకపోయినా..
ఈర్ష్యా ద్వేషాలు లేకపోవడం..
స్వచ్చమైన మనసు ఎక్కడ వుంటే అక్కడికి ఎంత దూరమైనా…
మళ్లీ మళ్లీ వెళ్ళినా అలసట అనిపించదు…
ఆత్మ తృప్తిగా ఉంటుంది ..
మనసును శుభ్రపరచుకొన్న భావన…
ఎంత కష్టమైనా…
ఈ వయసులో కూడా అలాంటి వారి దగ్గరకు వెళ్లి కలువాలని ..
మనసు తీరా మాటాడాలని ..
సేద తీర్చుకోవడానికి ….
చెట్టు నీడకు చేరినట్టు… .
ప్రతి ఒక్కరికి ఇది నా కొట్టు ..
అనే భావన…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!