ఎలా చెప్పను?

ఎలా చెప్పను?

రచయిత: జయకుమారి

నా హృదయం లో మోహనరాగం ఆలపించిన ప్రియసఖుడా.!!

నీ కొంటె చూపు తో.!
నా కనులలో ప్రేమ వేణువు మీటి.!
నా జీవితాన్ని మధువనంగా మలిచిన మనోహరా.!!

నీకెలా చెప్పను నీ రూపం ఎదను చేరి..
నా అణువణువు  పులికింతల అల్లిక
మొదలవుతుంది అని.!!

నా భయాలు అన్నిటికీ నీ కౌగిలి కోట గా మారిందని.!

నా చివరి క్షణం వరకు నీ ధ్యాసలో
నీ ప్రేమక్షరాలను దుప్పటిగా కప్పుకొని.!!

హాయిగా కలతలు మరిచి నిధురిస్తానని ..
ఎలా చెప్పను.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!