అక్షయ గవాక్షం..అక్షరం

అక్షయ గవాక్షం..అక్షరం

రచన : సుజాత.పి.వి.ఎల్

పలువురికి పంచినా
తరగని నిధి..
నాడు రాతి పలకలు
నేడు అచ్చు యంత్రాల్లో
ఒద్దిగగా కూర్చినా..
శ్రద్ధతో నేర్చిన వారికి సంస్కార ప్రదాయి..
అజ్ఞాన తిమిర సంహారంతో
వెలుగులు పంచే జ్ఞాన ప్రకాశి విద్య!
మానవ జీవన గమనాన్ని
సానుకూలం చేసే అక్షరం
ఓ పనిముట్టు..ఆయుధం..
ప్రగతి పథ సోపానం..
మనిషికి మాత్రమే లభించిన అమూల్య ధనం..
అరుదైన వరం!
వినయ గుణ సంపదల
అక్షయ గవాక్షం..అక్షరం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!