పుణ్యభూమి

పుణ్యభూమి

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

కులమతాలకు అతీతంగా బతుకుతూ
స్వేచ్ఛాస్వాతంత్రాలతో వెలుగొందుతూ
మనుష్యులంతా స్నేహ భావంతో మెలుగుతూ
ఈ పుణ్యభూమి గర్బాన ఆనంద జీవనం సాగుతూ

వేలాది పుణ్యతీర్ధాలకు ఆవాసం అవుతూ
ఎన్నో వేల ఖనిజ సంపదలకు
నిదిగా మారుతూ
విభిన్న సంస్కృతి, సంప్రదాయాల కలయికతో
దేశ విదేశాలకు ఆదర్శంగా భారత్ నిలబడుతూ

ఎన్నో రకాల అందాలతో మది పులకించిపోతూ
పక్షుల కిలకిల రాగాలాపనకు ఆనందపడుతూ
నీలి ఆకాశాన్ని తలపించే ఆ సాగరపు తాకుతూ
ఆ ప్రకృతి అందాల నడుమ కేరింతలు కొడుతూ

నీటి కొరతను తీర్చటానికి పాట్లు పడుతూ
తిండి కోసం పవిత్రమైన ఈ అమ్మను తవ్వుతూ
ఎన్నో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతూ
ఆ పుణ్యభూమి ఋణం తీర్చుకోవటం మన భాద్యత

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!