ఆశావాదం

ఆశావాదం

రచన: ఉండవిల్లి సుజాతా మూర్తి

రాయబారులు తాళపత్ర లేఖలు
ఎగిరే పావురాలు నోటకరుచు ఉత్తరాలు
క్షేమం తెలుపుతూ…
ఒక్క కార్డుముక్క రాద్దూ…

అని

బ్రతిమాలడాలూ
ఎత్తుకు ఎదిగీ…ఎదిగీ
ఠక్కున మీటనొక్కగనే
శాటిలైట్ తో సందేశాల వెల్లువలు
ఆ పోటెత్తిన వాటిని
పునః పంపే పరంపర
సాగుతున్న సామ్రాజ్యాన
ముల్లుపోయి కత్తివచ్చె ఢాం ఢాం ఢాం లా
ఏమో ఏమగునో గానీ
రేపటి తరాన రెడ్డొచ్చి మొదలగునా అని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!