భగీరథుడు
రచన: బండి చందు
నా దేశపు మకుటం లేని మహారాజతను
మానవాళి వజ్రాయుధపు వెన్నుముకతను
దున్నకం మొదలు కోతల
వరకూ అతను శ్రామికుడే
ఎరువుల ప్రభావం పంటపై
కన్నా తనపైనే ఎక్కువ
ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు
వయ్యారంగా ఊయలుగు గాలి
సైతం ఊపిరాడనివ్వడం లేదతనికి
వరుణుడు కొంచెం కోపించినా
భూతల్లి కించిత్ అగ్రహించినా
నాటు వేయు నారీమణులు శపించినా
అతని కంట కన్నీటి గంగ భువి చేరును
కన్నీళ్లతో నిత్య అపర భగీరథుడైనా
అతని పొలమెందుకో నేడు బీడు వారింది
ఆ కంట నీరు ఇంకిపోయింది కాబోలు…