ప్రేమగా ప్రేమిస్తా నీ ప్రేమనే
రచన: జయ
తొలకరి చిరుజల్లువై నను తడిపిన
చిలిపి చిరుగాలివై నను తాకిన
పండు వెన్నలవై నను మరిపించిన.
ఉరిమే మేఘమై నను బెదిరించిన
వేసవితాపనివై నను దహించిన.
వేణుగానమై నను మురిపించిన.
నీ మౌనం తో నను బాధించినా.
నీ ప్రేమ తో నను ముంచేసిన.
నీ కొంటె చూపుతో నను అల్లరిచేసిన.
నీ కౌగిలి లో నను బంధించిన
నువ్వు ప్రేమ తో ఇచ్చే ఏదైనా
సంతోషంగా స్వీకరిస్తా, మౌనం గా భరిస్త.
ప్రేమ గా ప్రేమిస్తా నీ ప్రేమనే.
******