ప్రేమ వనం

ప్రేమ వనం

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

పిల్లగాలి తెమ్మెరలు,

కోయిల కుహు కుహులు..

మదిని మురిపించే సువాసనలు

కళ్ళకి ఇంపైన రకరకాల సుతిమెత్తని పువ్వులు,,,,

ఇవేమీ ఇవ్వలేని ఆనందం, నీకుండే ప్రశాంతత ఇస్తుంది.

మన మనసే ఒక నందనవనం.

రెక్కల గుర్రం ఎక్కించాలని,

చందమామను తెచ్చి ఇవ్వాలని,

పండు వెన్నెల దోసిట పటి అందించాలని,

కాళ్లకింద తెల్లని తివాచీలు పరచాలనీ,

ఆశలన్నీ… నువ్వు చూపించే ప్రేమ ముందు

చిన్నబోయాయి. అది ప్రేమ గొప్పతనమే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!