నవ్వుతూ జీవించు

నవ్వుతూ జీవించు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

పసిపాప పాలు బుగ్గలను చూసి నవ్వు
పాడి కుండ పై తెరలు చూసి పులకించు
ఎగసి పడే కెరటాలను చూసి ఆనందించు
ఏ భాద నీకు గుర్తుకు రాదు గమనించు

రంగుల రాట్నంలో పిల్లల కేరింతలు
పచ్చని పైరుల్లో మేకపిల్ల కుప్పిగంతులు
చిరుఝల్లుల్లో సూర్యుని వెచ్చని కిరణాలు
ప్రేమమయ మదిలో కోటి తారకల వెలుగులు

ప్రేమతో నిండిన కౌగిలిలో సేద తీరి చూడు
గోదావరి ఒడిలో సేద తీరినట్టు అనుభూతి చెందు
చెంపపై కారే కన్నీరు కూడా కాగలదు నీ బంధువు
నీ ఆత్మీయులు అందించే ఆ చేతి స్పర్శతో

నిండు పున్నమి రేడు పంచే వెన్నెల సాక్షిగా
ఆకాశంలో ఎగిరే ఆ పక్షుల చెలిమి సాక్షిగా
నీ జీవితం హాస్యాస్పదం కాదు ఎన్నటికీ
అందమైన ఆనంద లోకం నీ సొంతమవుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!