భావాల లాలన

భావాల లాలన
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి

సుగంధ పరిమళం
ప్రభంధ పుష్పమై పూస్తుంది !
మధుమరువం
మధూళికా గీతమై వీస్తుంది !
సంధ్యా జాబిలి
వెన్నెల విభూతియై !
తొలి ప్రభాతం
సింధూర తిలకమై !
పచ్చని అవంతిక
పరువపు ప్రవళ్ళికై !
స్వాగతిస్తున్నాయి నను…నామనసును
సురాగపు..సుధానిధి
నింపుకున్న హసితమా
నీ భావాల లాలనలో…మునుగుతున్నా
నీ అనురాగపు ఆలాపనలో….తేలియాడుతున్నా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!